Begin typing your search above and press return to search.
చైనా చేతిలో కరోనా తరహా వైరస్ లు..1,500లకు పైగానే ఉన్నాయా?
By: Tupaki Desk | 27 March 2020 4:45 AM GMTప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలోకి నెట్టేసిన కరోనా వైరస్ ను పోలిన్ వైరస్ లు వందలు, వేల సంఖ్యలో ఉంటే.. అవి కూడా వరుసగా మానవాళిపై దండెత్తితే... భూగోళంపై మనిషి అనే వాడు ఉంటాడా? సమస్యే లేదు. అయినా ఒక్క కరోనాను కట్టడి చేసేందుకే ప్రపంచ దేశాలు కిందా మీదా పడిపోతుంటే... వరుసపెట్టి 1,500 వైరస్ లు మనపైకి దండెత్తితే.. పరిస్థితిని ఊహించడానికే సాధ్యం కాదు. అయితే మరి ఈ 1,500 వైరస్ లు ఎప్పుడు మన మీదకు దండెత్తడానికి వస్తాయి? అయినా ఇన్నేసి ప్రాణాంతక వైరస్ లు ఎక్కడ ఉన్నాయి. ఇంకెక్కడండీ బాబూ... కరోనాకు జన్మస్థానంగా పరిగణిస్తున్న చైనా నగరం వూహాన్ లోనేనట. అదేంటీ.. వూహాన్ లో చైనా ఏమైనా వైరస్ ఫ్యాక్టరీ పెట్టిందా? ఇప్పటికే కరోనా వైరస్ తన సృష్టేనంటూ ప్రపంచ దేశాలు... ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికా అనుమానంగా చూస్తుంటేనే తట్టుకో లేకపోతున్న చైనా.. కరోనాను పోలిన 1,500 వైరస్ లను ప్రపంచం మీదకు వదులుతుందా? ఏమో.. వరల్డ్ సూపర్ పవర్ గా అవతరించే క్రమంలో చైనా అంతటి దుస్సాహసానికి పాల్పడితే.. ఇక మానవాళి పరిస్థితి అంతే సంగతులు.
ఇప్పటికే కరోనా వైరస్ చైనా సృష్టేనని.... దానిని చైనా ప్రపంచం మీదకు వదలడం ఖాయమేనని ఎప్పుడో 1981లో విడుదలైన ‘ద ఐస్ ఆప్ డార్క్ నెస్’ పుస్తకంలో ఉన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కరోనా వైరస్ ను చైనా... వూహాన్ నగరంలోనే ‘వూహాన్ 400’ పేరిట ఉత్పత్తి చేసిందని, తన చేతిలోని ఈ బయలాజికల్ ఆయుధాన్ని ఎప్పుడైనా ప్రపంచం మీదకు వదలడం ఖాయమని కూడా ఆ పుస్తక రచయిత డీన్ కూంజ్ రాసుకొచ్చారు. ఆ పుస్తకంలో కూంజ్ చెప్పినట్టుగానే ఇప్పుడు వూహాన్ నుంచే వూహాన్ 400 కాకుండా కోవిడ్-19 జనాలపై పడింది. మరి కూంజ్ రాసినట్టే కరోనా ప్రజల పాలిట పెనుభూతంగా మారితే... అలాంటి వైరస్ లు చూైనా చేతిలో ఇంకా 1,500 లకు పైగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తుంటే.. ఆ వార్తలను కూడా నమ్మి తీరాల్సిందే కదా.
ఈ వార్త నిజమే అయితే... మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఆ 1,500 వైరస్ లు మానవ జాతిపై దాడి చేస్తే... ఇక భూగోళం మీద మనిషి అన్న వాడి మాటే వినిపించదు. కనిపించదు. మనిషి జాతి అంతరించడం ఖాయమే. మరి ఇంత ప్రమాదం మనకు పొంచే ఉందంటారా? అంటే... పొరుగు దేశాల వైపు ఆ దేశం చూస్తున్న చూపులను చూస్తే... అంతటి దుస్సాహసానికి ఆ దేశం ఒడిగట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కూంజ్ చెప్పినట్లుగా చైనాకు వరల్డ్ సూపర్ పవర్ అనిపించుకోవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉన్న మాట నిజమే. అందులో భాగంగానే ఏళ్ల నాటి నుంచి కూడా అమెరికాను చూస్తే... చైనా ఉడికిపోతున్న వైనం కూడా మనకు కొత్తేమీ కాదు. అగ్రరాజ్యం బిరుదును అమెరికా నుంచి లాగేసుకుని తానే సూపర్ పవర్ అనిపించుకోవాలని ఏనాడైనా చైనా బలంగా కోరుకుంటే... తన అమ్ముల పొదిలోని ఈ 1,500 ప్రాణాంతక వైరస్ లలో దేనినో ఒకదానిని వదిలినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనాతో వణికి పోయిన చైనా... ప్రపంచ దేశాలు తనవైపు అనుమానంగా చూస్తున్న చూపులను గుర్తు చేసుకుంటే అంత పని చేయదులే అని మనకు మనం ధైర్యం చెప్పుకుని తీరతాం అన్న వాదన కూడా లేకపోలేదు.