Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో:151 మంది ఎందుకు చనిపోయారంటే
By: Tupaki Desk | 26 Jun 2017 8:44 AM GMTపాకిస్థాన్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైరల్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాక్ లోని జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటం.. దాన్లోని పెట్రోల్ ను పట్టుకునేందుకు జనాలు విపరీతంగా ప్రయత్నించటం.. ఈ హడావుడిలో ఏమైందో ఏమో కానీ.. పేలిపోయిన ట్యాంకర్ తో 151 మంది దుర్మరణం చెందటమేకాదు.. పెద్ద ఎత్తున గాయాల పాలైన వైనం అటు పాక్ లోనూ.. సమీప దేశాల్లోనూ విషాదాన్ని నింపింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రంజాన్ పండక్కి ఒక్కరోజు ముందు చోటు చేసుకున్న ఈ పెను విషాదానికి సంబంధించిన వీడియోను ఒక అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కరాచీ నుంచి లాహోర్ కు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ బహవల్ పూర్ జిల్లా అహ్మద్ పూర్ వద్ద టైరు పేలటంతో బోల్తా పడింది. ఈ ట్యాంకర్ లో 50వేల లీటర్ల పెట్రోల్ ఉంది. ట్యాంకర్ లీక్ కావటంతో అందులోని పెట్రోల్ బయటకు వచ్చేసింది.
దీంతో.. ట్యాంకర్ నుంచి వస్తున్న పెట్రోల్ ను పట్టుకునేందుకు ఎవరికి వారు.. బకెట్లు..క్యాన్లు.. బాటిళ్లు.. తీసుకొని గుంపుగా ట్యాంకర్ మీదకు వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు.. జనాల్ని ఎంతగా కంట్రోల్ చేద్దామనుకున్నా సాధ్యం కాలేదు. రోడ్డు మీద కావడంతో వాహనాల ట్రాఫిక్ కూడా పెరిగింది. ఇలాంటి ఉదంతాల దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించినా ఎవరూ వినలేదట. అధికారుల మాట వినకుండా ట్యాంకర్ చుట్టూ చేరిపోయి.. పెట్రోల్ పట్టుకోవటంలో ఎవరికి వారు బిజీ అయిపోయారు. ఈ సమయంలోనే ఒకరు సిగిరెట్ అంటించటంతో ఒక్కసారిగా అగ్గి రాజుకొని ట్యాంకర్ పేలింది. ఇది క్షణాల్లో జరిగింది. ట్యాంకర్ చుట్టూ పెద్ద ఎత్తున గుంపు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా మారింది. ఒకరి నిర్లక్ష్యం 151 నిండు ప్రాణాలు పోయేలా చేసింది. పెట్రోల్ పట్టుకోవాలన్న అత్యాశ భారీ ఎత్తున ప్రాణాలు పోయేందుకు కారణమైంది. తాజా వీడియోలో ఈ నిజం బయటకు వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/