Begin typing your search above and press return to search.

దొంగకి కరోనా పాజిటివ్ ...క్వారంటైన్ లో జడ్జి, పోలీసులు ..కారణం ఏంటంటే ?

By:  Tupaki Desk   |   11 April 2020 7:15 AM GMT
దొంగకి కరోనా పాజిటివ్ ...క్వారంటైన్ లో జడ్జి, పోలీసులు ..కారణం ఏంటంటే ?
X
కరోనా దేశంలో అలజడి సృష్టిస్తున్న ఈ నేపథ్యంలో పంజాబ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు ఇప్పుడు ఎవరికీ కరోనా వైరస్ ఉందొ ..ఎవరికీ కరోనా వైరస్ లేదో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ వ్యాధి లక్షణాలు కొందరిలో వెంటనే బయటపడుతున్నా కూడా మరికొందరిలో మాత్రం పెద్దగా బయటపడటం లేదు. ఎదో పెద్ద సమస్యగా మారింది.

కాగా , పంజాబ్ లోని లూథియానాలో చైన్ స్నాచింగ్‌ కి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం న స్థానికులు పట్టుకుని, దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత పోలీసులు వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆ కేసు పై జడ్జి విచారణ జరుపుతుండగా ఇద్దరు దొంగలు దగ్గుతూనే ఉన్నారు. దినీటి జడ్జికి అనుమానం వచ్చి వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జడ్జి ఆదేశాలు మేరకు వారిద్దరిని కరోనా నిర్దారణ పరీక్షల కోసమా హాస్పిటల్ కి తీసుకోని వెళ్లగా ..వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయం లో ఒక దొంగ పరారయ్యాడు. మరో దొంగకు కరోనా పాజిటివ్‌ గా తేలింది.

దీనితో వెంటనే ..ఆ దొంగను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అలాగే వారి వెంట వచ్చిన ఏడుగురు పోలీసులు హోం క్వారెంటైన్‌ లోకి వెళ్లారు. అలాగే వారి కేసుని విచారించిన ఆ న్యాయమూర్తి కూడా హోం క్వారెంటైన్‌ లోకి వెళ్లారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా క్వారెంటైన్‌ లోకి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు తప్పించుకుపోయిన మరో దొంగ కోసం వెతుకుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా,ఇప్పటివరకు పంజాబ్‌లో 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మే 1 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య మంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ కు ఒకరోజు ముందే అమరీందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.