Begin typing your search above and press return to search.
16 కోట్ల పన్ను కట్టేందుకు రామ్మోహన్ అంగీకారం
By: Tupaki Desk | 23 Dec 2016 9:55 AM GMTతన ఇంట్లో దొరికిన నల్లధనానికి పన్ను చెల్లించేందుకు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అంగీకరించారు. గడచిన మూడు రోజులుగా రామ్మోహన్ రావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లెక్కకు చూపని కోట్లాది రూపాయల ధనాన్ని - పెద్ద మొత్తంలో బంగారాన్ని - స్థిర - చరాస్తులను సీబీఐ - ఈడీ అధికారులు గుర్తించారు. ఆపై తమిళనాడు ప్రభుత్వం రామ్మోహన్ రావును తొలగిస్తూ, గురువారం నాడు ఉత్తర్వులు వెలువరించింది.
కాగా ఆయన ఇంట్లో సోదాలు ముగిశాయని అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. మొత్తం 13 చోట్ల సోదాలు చేశామని - రూ. 16 కోట్ల వరకూ ఆయన పన్ను బకాయి ఉండటంతో అది చెల్లించేందుకు ఆయన అంగీకరించారని, నిబంధనల ప్రకారం కేసు విచారణ జరుగుతుందని వెల్లడించారు.
రామ్మోహనరావు ఇంట్లో భారీగా బంగారం - నగదు బయటపడింది. శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రావుకు లింకులు ఉండబట్టే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్టు చెబుతున్నారు. అయితే రామ్మోహన్ రావుతో ఏపీలోని టీడీపీ నేతలకూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు టీడీపీ నేత బద్రినారాయణ స్వయాన రామ్మోహన్ రావుకు వియ్యంకుడు. దీంతో అటు రామ్మోహన్ రావు ఇంటితో పాటు చిత్తూరులో టీడీపీ నేత బద్రినారాయణ ఇంటిపైనా ఐటీ దాడులు జరిగాయి. అంతేకాదు రామ్మోహన్ రావుకు వియ్యంకుడైన బద్రినారాయణ… చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చాలా దగ్గరి బంధువు. బద్రీనారాయణ ద్వారానే శేఖర్ రెడ్డి రామ్మోహన్ కు మధ్య స్నేహం ఏర్పడిందని చెబుతున్నారు. 2007లో రామ్మోహన్ రావు తల్లి వారి స్వగ్రామం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో సర్పంచ్ గా కూడా ఎన్నికయ్యారు. 2011 వరకు ఆ పదవిలో కొనసాగారు. ప్రతి ఏటా రామ్మోహన్ రావు సంక్రాంతికి సొంతూరు వస్తుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/