Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వదిలేసిన పూరన్ కు లఖ్ నవూ రూ.16 కోట్లు..

By:  Tupaki Desk   |   23 Dec 2022 11:30 PM GMT
హైదరాబాద్ వదిలేసిన పూరన్ కు లఖ్ నవూ రూ.16 కోట్లు..
X
వెస్టిండీస్ బ్యాట్స్ మన్ నికోలస్ పూరన్ తంతే బూరల బుట్టలో పడ్డాడు. పనికిరాడని సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అతడికి రికార్డు ధర దక్కింది. ఓ బ్యాట్స్ మన్ కు ఎన్నడూ లేనంత స్థాయిలో పూరన్ కు రూ.16 కోట్లు దక్కనున్నాయి. ఈ ధరకు అతడిని లక్ నవూ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇదే వేలంలో సామ్ కరన్ రూ.18.50 కోట్ల అత్యధిక ధర పలకగా, గ్రీన్ కు రూ. 17.50 కోట్లు, బెన్ స్టోక్స్ కు రూ,16.25 కోట్లు దక్కాయి.

వీరిని వరుసగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేశాయి. వీరి త్వరాత పూరన్ దే అత్యధిక ధర (రూ16 కోట్లు) కావడం విశేషం. ఇతడి తర్వాత మరే ఆటగాడూ రూ.15 కోట్ల మార్క్ దాటలేదు. ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు దక్కించుకుంది. మొత్తమ్మీద వేలంలో రూ.10 కోట్లు పైన పలికిన వారు వీరే. ఆ తర్వాత రికార్డు ధర మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు)ది. ఇతడిని హైదరాబాద్ వశం చేసుకుంది.

హైదరాబాద్ కు క్లాసెన్ నికోలస్‌ పూరన్ కోసం తొలుత రాజస్థాన్‌, చెన్నై బరిలోకి దిగగా.. మధ్యలో దిల్లీ వచ్చి చేరింది. దీంతో చెన్నై విరమించుకొంది. రాజస్థాన్‌, దిల్లీ మధ్య దాదాపు రూ. 8 కోట్ల వరకు వెళ్లింది. అయితే లక్‌నవూ రేసులోకి రావడంతో రేటు రూ. 12 కోట్లకు చేరింది. చివరికి లక్‌నవూ రూ. 16 కోట్లకు పూరన్‌ను సొంతం చేసుకొంది.

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్‌ క్లాసెన్‌ ను హైదరాబాద్‌ దక్కించుకుది. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన క్లాసెన్‌ కోసం హైదరాబాద్‌, దిల్లీ పోటీ పడ్డాయి. సన్‌రైజర్స్‌ రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకొంది. కుశాల్‌ మెండిస్, టామ్‌ బాంటన్ అన్‌సోల్డ్‌. ఫిల్‌ సాల్ట్‌ను దిల్లీ రూ. 2 కోట్లకు దక్కించుకొంది. క్లాసెన్ కోసం ఢిల్లీ రూ.1.20 కోట్లు పెట్టేందుకు వచ్చినా.. చివరి నిమిషంలో హైదరాబాద్ వశం చేసుకుంది.

పూరన్ కు అంత ధరా?

లీగ్ వేలంలో ఎవరి పంట పండుతుందో చెప్పలేం. అందుకు పూరన్ నిదర్శనం. అతడి కోసం లఖ్ నవూ పెట్టి న మొత్తం గతంలోని ధరకు మూడు రెట్లు కావడం విశేషం. పూరన్ మంచి బ్యాట్స్ మన్ అయినా.. నిలకడ లోపం. విండీస్ క్రికెటర్లకు సహజంగా ఉండే దూకుడు పూరన్ లో కనిపిస్తుంది.

కానీ, దానిని క్రీజులో దిగాక చూపడంలో విఫలం అవుతుంటాడు. ఇక వేలంలో అతడి ధర రూ.4 కోట్లు, రూ.11 కోట్లు, రూ.14.50 కోట్లు.. అలాఅలా పెరుగుతూ పోయింది. చివరకు రూ.16 కోట్ల వద్ద లఖ్ నవూ సొంతం చేసుకుంది. తొలుత ఢిల్లీ, రాజస్థాన్ పోటీపడడంతో రూ.6 కోట్లకు చేరింది. ఆ తర్వాత అది రూ.8 కోట్లయింది. వీరికి కాకుండా చివరకు రూ.16 కోట్లకు లఖ్ నవూ పరమయ్యాడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.