Begin typing your search above and press return to search.
మాటు వేసి నక్సల్స్ మారణకాండ.. 16 మంది మృతి
By: Tupaki Desk | 1 May 2019 10:37 AM GMTనక్సల్స్ విచక్షణారహితంగా వ్యవహరించారు. రాజ్యం మీద తమకున్న కోపాన్ని పోలీసుల మీద ప్రదర్శించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు వాహనాన్ని పేల్చేసి 16 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్నారు. గడిచిన 24 గంటల్లో వాహనాలకు అదే పనిగా నిప్పు పెడుతూ.. విధ్వంసం సృష్టిస్తున్న నక్సల్స్ తాజాగా వాహనాన్ని పేల్చి సంచలనం సృష్టించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గడ్చిరోలిలో భద్రతా సిబ్బందితో వెళుతున్న ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 16 మంది సిబ్బంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. పేలుడు అనంతరం.. కొందరు పోలీసులు నక్సల్స్ పై కాల్పులు షురూ చేశారు. దీంతో.. వారిద్దరి మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ఈ రోజు మహారాష్ట్రలో మహారాష్ట్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే నక్సల్స్ ఇంత దారుణానికి పాల్పడటం గమనార్హం. పురాందా-మాలేగావ్- యెర్కడ్ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వాడుతున్న 36 వాహనాలకు నిప్పు పెట్టి.. నిర్మాణ పనుల్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాల్ని తగులబెట్టిన ఉదంతంలో దాదాపు రూ.10 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.