Begin typing your search above and press return to search.
నరరూప రాక్షసులకు ఎయిడ్స్ భూతం పట్టేసింది
By: Tupaki Desk | 13 Dec 2015 3:51 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న నరరూప రాక్షసుల్లాంటి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇప్పుడు విపరీతంగా వణికిపోతున్నారు. ఇంతకాలం ప్రపంచాన్ని వణికించిన వారిని.. ఎయిడ్స్ మహమ్మారి తాజాగా వారిని వణికిస్తోంది. తమ ఆరాచకాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఐఎస్ తీవ్రవాదుల్లోని విపరీత ధోరణే వారికి ముప్పుగా మారింది. ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచి పెట్టి.. ఇండోనేషియాకు చెందిన ఒక ఐఎస్ తీవ్రవాది యాజాదీ మహిళలపై అత్యాచారం చేశాడు. దీంతో.. వారు ఎయిడ్స్ కు గురయ్యారు.
ఈ విషయాన్ని తెలీక మరికొందరు ఐఎస్ తీవ్రవాదులు.. ఆ మహిళలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో.. ఎయిడ్స్ ఒకరి తర్వాత ఒకరిగా గొలుసుకట్టుగా పాకింది. కాస్త ఆలస్యంగా ఎయిడ్స్ ఉన్న ఇండోనేషియా తీవ్రవాది విషయం బయటకు రావటంతో అతగాడ్ని కాల్చి చంపేశారు. ఎయిడ్స్ అంటించునోడు చచ్చినా.. వాడి దుర్మార్గం కారణంగా పెద్దఎత్తున ఐఎస్ తీవ్రవాదులు ఎయిడ్స్ బారిన పడినట్లు తెలుస్తోంది.
దీంతో.. తమలోని ఎంతమందికి ఎయిడ్స్ అంటిందన్న విషయాన్ని టెస్ట్ చేసుకునేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారు. ఎయిడ్స్ వ్యాధిని నిర్దారించే కిట్లు వీరి దగ్గర తగినంతగా లేకపోవటంతో.. ఎంతమందికి ఎయిడ్స్ సోకిందన్న విషయం తేలటం లేదట. ఇప్పటివరకూ 16 మంది రాక్షసులకు ఎయిడ్స్ అంటినట్లుగా అంచనా వేస్తున్నారు.