Begin typing your search above and press return to search.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా మరో 16

By:  Tupaki Desk   |   6 April 2020 7:30 AM GMT
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా మరో 16
X
కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌ లో విజృంభిస్తోంది. ఆ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. వారం రోజులుగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు ఉంటున్నాయి. నిన్న ఆదివారం ఒక్కరోజే 60 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మరో 16 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కల్లోలం రేగుతోంది. వీటి వలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం కేసుల సంఖ్య 268కు చేరాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు మరో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 268కు చేరింది.విశాఖపట్నంలో 5 - అనంతపూరములో 3 - కర్నూల్‌ లో 6 - గుంటూరులో 2 - పశ్చిమ గోదావరిలో ఒకటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో బాధపడుతున్న వారిలో ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. దీనికి ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారే కారణమని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ లోని దాదాపు అన్ని జిల్లాలకు కరోనా వైరస్‌ పాకుతోంది. కొత్తగా కర్నూలు జిల్లాలో 26 - నెల్లూరులో 34 - వైఎస్సార్‌ కడపలో 23 - గుంటూరులో 30 - కృష్ణాలో 28 - ఒంగోలులో 23 - చిత్తూరు జిల్లాలో 7 కేసులు నమోదయ్యయాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 90 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని, వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంచారు. వారికి సత్వరమే వైద్యం అందిస్తున్నారు. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.

కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్స్‌ లో మోగిస్తోంది. ఢిల్లీ కాంటాక్ట్‌ లిస్టింగ్‌ కారణంగా కరోనా ప్రమాదకరంగా మారింది. ఈ జిల్లాలో ఒకే ఒక్క రోజు 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 56కి చేరింది. పాజిటివ్‌ వచ్చిన వారిని నంద్యాలలోని శాంతిరాం ఆస్పత్రికి తరలిస్తున్నారు. నెగిటివ్‌ రిపోర్టులు వచ్చిన వారిని మరో 14 రోజులు హోం క్వారంటైన్ లలో ఉంచుతున్నారు. వీరి కోసం హోటళ్లు - ప్రైవేట్‌ భవనాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

కర్నూలు జిల్లాలోని కేసులు ఇలా ఉన్నాయి. కర్నూలు (అర్బన్‌) 18 - నంద్యాల (అర్బన్‌) 10 - నందికొట్కూరు 3 - ఆత్మకూరు 2 - బనగానపల్లె 3 - నంద్యాల (రూరల్‌) 2 - బేతంచర్ల 1 - గడివేముల 2 - పాణ్యం 4 - రుద్రవరం 1 - కోడుమూరు 3 ఉన్నాయి.