Begin typing your search above and press return to search.
ఛీ..ఛీ:16ఏళ్ల అబ్బాయిని 15మంది రేప్ చేశారు
By: Tupaki Desk | 3 Aug 2017 9:25 AM GMTషాకింగ్ తో నోట మాట రాని వైనమిది. దుర్మార్గం అనే మాట కూడా సిగ్గుపడిపోయే ఈ నికృష్ట ఉదంతం ముంబయిలో చోటు చేసుకుంది. దేశ ఆర్థికరాజధానిగా సుపరిచితమైన ముంబయి మహానగరంలో ఒక టీనేజర్ పై ఏడాది కాలంగా 15 మంది తోటి బాలురు అసహజరీతిలో రేప్ చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది.
మర్మాంగం దగ్గర తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్న ఆ కుర్రాడు.. తన స్నేహితుడికి జరుగుతున్న దురాగతాన్ని చెప్పటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయం గురించి తెలిసిన వెంటనే.. షాక్ తిన్న పోలీసులు.. తొలుత ఆ కుర్రాడిని వైద్య పరీక్షలకు పంపారు.
అతడిపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు. తనను లైంగికంగా దాడి చేస్తున్న కుర్రాళ్ల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని బాధిత కుర్రాడు తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అసహజరీతిలో లైంగిక చర్యకు పాల్పడిన 15 మంది కుర్రాళ్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం చేసిన కుర్రాళ్లందరూ 15 నుంచి 17 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం.
ఇప్పటివరకూ 8 మంది నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలీ దారుణమంతా ఎలా మొదలైందన్న విషయాన్ని విచారించగా.. 2016లో బాధిత బాలుడి ఇంటి పక్కనే ఉన్న మరో బాలుడు లైంగిక దాడి చేశాడు. దాన్ని వీడియో తీసి.. తన స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను చూపించి బ్లాక్ మొయిల్ చేస్తూ.. తన స్నేహితులతో కలిపి లైంగిక దాడి చేయించేవాడు.
నిందితుల్లో ఒకరు బాధితుడ్ని రెస్టారెంట్ కు వెళ్లి తినేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. తన దగ్గర డబ్బులు లేవని బాధితుడు ఇవ్వలేదు. దీంతో.. నిందితుడు మరోసారి అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు. వరుసగా జరుగుతున్న పరిణామాల్ని భయంతో తల్లిదండ్రులకు చెప్పలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు షాక్ తింటున్నట్లు చెబుతున్నారు.