Begin typing your search above and press return to search.
మహారాష్ట్రలో దారుణం.. వైరస్‌కు 18 మంది పోలీసులు మృతి
By: Tupaki Desk | 23 May 2020 9:53 AM GMTదేశంలో మహమ్మారి వైరస్ ఎంతకీ తగ్గడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో వైరస్ విజృంభణ తీవ్రమైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీరిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా ఉన్నారు. ఆ వైరస్ బారిన పడి ప్రజలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా మృత్యువాత పడుతుండడం కలవరం రేపుతోంది. ఇప్పటిదాకా 18 మంది పోలీసులు ఆ మహమ్మారి బారిన పడిన మృతిచెందారని మహారాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది.
ఇప్పటివరకు 1,666 మంది పోలీసులకి ఆ వైరస్ వ్యాపించింది. వీరిలో 18 మంది మరణించారు. తాజాగా ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైరస్ తో మృతి చెందినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. వయసు పైబడిన కారణంగా కొన్ని రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. శుక్రవారం ఆయన మృతి చెందాడని.. అయితే పరీక్షలు చేస్తే వైరస్ సోకిందని తేలింది. మే 21వ తేదీన ఈ వైరస్ బారిన పడి ఏఎస్‌ఐ భివ్‌సేన్ హరిభావు కూడా మృతి చెందారు. ఈ విధంగా పోలీసులు వైరస్‌కు బలికావడంపై ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నివారణ చర్లయు ముమ్మరం చేసింది.
వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వయసు పైబడిన వారిని విధుల్లోకి రావొద్దంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులకు వైరస్ వ్యాపిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా తమకు సాయుధ పోలీసు దళాల నుంచి సుమారు 2000 మంది అదనపు పోలీసులను పంపాలన్ని కోంద్ర ప్రభుత్వాన్ని కోరింది.మహారాష్ర్టలో ఇప్పటివరకు 44,582 పాజిటివ్ కేసులు రాగా, 1,517 మంది మృతిచెందారు. మృతులు, పాజిటివ్ సంఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి.