Begin typing your search above and press return to search.
మాకో రైల్వేజోన్ కావాలి..వీఐపీల స్పెషల్ డిమాండ్
By: Tupaki Desk | 2 July 2018 11:48 AM GMTవిశాఖకు ప్రత్యేక రైల్వే జోన్... రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అంశం. ఈ విషయమై నవ్యాంద్రప్రదేశ్ వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. కొద్దినెలల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన అధికార తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో గొంతెత్తిన పాపాన పోలేదు. ఇప్పుడేమో ఆ పార్టీ ఎంపీ ఓట్ల కోసం దీక్షల నాటకాలు మొదలుపెట్టారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి లో ఆందోళనలు - దీక్షలు మొదటి నుంచి చేస్తోంది. ఇటు క్షేత్రస్థాయిలో అటు పార్లమెంటులో గళం విప్పుతోంది. ఇలా ఓ వైపు ఏపీకి పార్టీలు గళం విప్పుతుంటే..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తమకు న్యాయబద్దంగా దక్కాల్సిన జోన్ గురించి నిరీక్షణలో ఉంటే..కొందరు వీఐపీలు తమకో రైల్వే జోన్ కావాలంటూ కేంద్రం వద్ద పైరవీలు చేస్తున్నారు. అందులో సెలబ్రిటీలు మొదలుకొని అధికార బీజేపీకి చెందిన పెద్దలు ఉండటం ఆసక్తికరం.
170 మంది ప్రముఖులు వారి నియోజకవర్గాల్లో రైల్వే జోన్లు - డివిజన్లు ఏర్పాటు చేయాలని గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా రైల్వే శాఖ రికార్డుల్లో వెల్లడైంది. వీరిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ - కేంద్ర మంత్రి - బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అందిన డిమాండ్లను పరిశీలించినట్టయితే... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్ పూర్ కు కొత్త రైల్వే జోన్ తో పాటు డివిజన్‌ను కోరగా - రాజన్ గోహెన్ ఈశాన్య ప్రాంతాలకు కొత్త రైల్వే జోన్ డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు సచిన్ టెండుల్కర్ ముంబై సబర్బన్ కు కొత్త రైల్వేజోన్ - శశీథరూర్ తిరువనంతపురం - కన్నూర్ కు కొత్త రైల్వేజోన్ తో పాటు డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు.
2014 నుంచి 2017(మార్చి 31 వరకు) మధ్య కాలంలో అందిన డిమాండ్లలో 55 మంది కొత్త రైల్వే జోన్లు - 119 మంది కొత్త డివిజన్ లను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా వారి డిమాండ్లు ప్రస్తుతం రైల్వేబోర్డు పరీశీలనలో ఉన్నాయి. . ఈ ప్రతిపాదనలను సమీక్షించడానికి రైల్వే బోర్డు ఏర్పాటు చేసిన కమిటీలు మాత్రం ఎక్కువ జోన్లు - డివిజన్లు ఏర్పాటు చేయడం ఆర్థికంగా - క్రియాశీలకంగా వీలు కాదని వెల్లడించాయి అంతేగాక ప్రస్తుతమున్న జోన్లను కూడా తగ్గించాలని సూచించాయని - అయినప్పటికీ డిమాండ్లు వస్తునే ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
భారతీయ రైల్వేలో తొలుత 17 జోన్లు ఉండగా తర్వాత వాటిని డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం మొత్తం 73 డివిజన్లు ఉన్నాయి. 2002-03లో ఏడు కొత్త జోన్లు - ఎనిమిది కొత్త డివిజన్లు ఏర్పాటు చేయగా 2007లో సాలెం డివిజన్ ను ఏర్పాటు చేశారు. 2009-13 మధ్య కాలంలో 92 కొత్త జోన్లు - 45 కొత్త డివిజన్ల ఏర్పాటుకు అభ్యర్థనలు అందాయి. వీటిని పరిశీలించడానికి 2012లో కమిటీ ఏర్పాటు చేయగా... వాటిలో ఏ ఒక్కటీ ఆమోదయోగ్యంగా లేదని కమిటీ వెల్లడించింది. కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు కోసం వీఐపీల నుంచి డిమాండ్లు విశేష సంఖ్యలో వచ్చినా నో చెప్పిన కేంద్రం ఏపీ విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా? అని కొందరు సందేహిస్తుండటం గమనార్హం.