Begin typing your search above and press return to search.

175కి 175.. వైసీపీ డ్యూయెల్ పాలిటిక్స్‌..!

By:  Tupaki Desk   |   20 Nov 2022 1:30 AM GMT
175కి 175.. వైసీపీ డ్యూయెల్ పాలిటిక్స్‌..!
X
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు చేసే విమ‌ర్శ‌లు కామ‌నే. అధికార ప‌క్షం దూకుడు కూడా కామ‌నే. అయితే,ఏపీలో మాత్రం చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఇటు అధికార పార్టీ చేస్తున్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు ఒక‌వైపు.. మ‌రోవైపు.. దూకుడు నిర్ణ‌యాలు. దీంతో వైసీపీ దూకుడును అందుకోవ‌డం.. కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌కు అలివికాని ప‌నిలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌..త‌న పార్టీ వారికి నిర్దేశించిన ల‌క్ష్యం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 ఎందు కు సాధించ‌లేమ‌ని! ముందు దీనిని లైట్ తీసుకున్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు అయితే, ఆ.. ఇది ఉత్త‌మాట‌లే! అని కొట్టిపారేశాయ్‌!.. కానీ, ఆత‌ర్వాత త‌ర్వాత వైసీపీ వేసిన వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్షాల‌కు.. మింగుడు ప‌డ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి తోడు ఇప్పుడు మ‌రో వ్యూహం దిశ‌గా వైసీపీ ప‌రుగులు పెడుతోంది.

అదే.. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. చ‌ర్చిల‌ను పున‌రుద్ధ‌రించేందుకు సీఎం జ‌గ‌న్ రెడీ అయ్యారు. మొత్తంగా ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌త ప్రార్థ‌నా మందిరాల‌నిర్మాణం.. ఆధునీక‌క‌ర‌ణ వంటి ప‌నుల‌కు రూ.కోటి చొప్పున ఆయ‌న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అంటే మొత్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రిస్ట‌య‌న్ల‌కు వైసీపీ అతి పెద్ద వ‌ల విసిరిన‌ట్టుగానే ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

పైగా.. ఈ వ‌ర్గాల్లోఎస్సీ, బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఏపీలో ప్రార్థ‌నా మందిరా ల‌కు వెళ్లేవారు బీసీలే ఎక్కువ‌గా ఉన్నారు. సో.. దీనిని గ‌మ‌నించే వైసీపీ ఇలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిందా? అనే చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. క‌నీసం 10-15 చ‌ర్చిలు ఉంటాయ‌ని తెలుస్తోంది. దీనికి నిధులు ఇవ్వ‌డం ద్వారా ఆయా వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నే వైసీపీ ఆలోచ‌న‌ను తిప్పుకొట్ట‌లేక‌.. టీడీపీ నాయ‌కులుస‌త‌మ‌తం అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.