Begin typing your search above and press return to search.

మతాంతర రిలేషన్‌ షిప్‌.. 18 మంది విద్యార్థులపై వేటేసిన ఆ రాష్ట్ర యూనివర్సిటీ!

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:30 AM GMT
మతాంతర రిలేషన్‌ షిప్‌.. 18 మంది విద్యార్థులపై వేటేసిన ఆ రాష్ట్ర యూనివర్సిటీ!
X
కర్ణాటకలో ఓ ప్రీ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. మతాంతర రిలేషన్‌షిప్‌ వ్యవహారానికి సంబంధించి 18 మంది విద్యార్థులను కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఓ ప్రీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. వీరందరినీ వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షలకు మాత్రమే హాజరు కావడానికి ఆ యూనివర్సిటీ అనుమతిచ్చింది.

మంగళూరులోని ఆ విద్యా సంస్థలో హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య సంబంధాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఒక ముస్లిం విద్యార్థి.. ఒక హిందూ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడనే విషయం బయటపడింది.

హిందూ అమ్మాయి, ముస్లిం వ్యక్తి మధ్య మతాంతర సంబంధంపై యూనివర్సిటీ ఆవరణలో వాగ్వాదం చెలరేగడంతో మొత్తం 18 మంది కళాశాల విద్యార్థులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ చేయబడిన విద్యార్థులందరూ వారి ప్రీ–యూనివర్శిటీ కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నారు. సస్పెండ్‌ అయిన 18 మంది విద్యార్థుల్లో ముగ్గురు బాలికలు కూడా ఉన్నారు. విద్యార్థుల్లో పది మంది హిందువులు కాగా, ఎనిమిది మంది ముస్లింలు.

మూడు నెలల క్రితం ఒక హిందూ యువతి, ఒక ముస్లిం వ్యక్తి ప్రేమించుకోవడంతో విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది. కళాశాల అధికారులు వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని కనుగొన్నారు. అప్పట్లో వారు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సంబంధాన్ని మానుకోవాలని హెచ్చరించారు.

ఇటీవల, యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు మొబైల్‌ ఫోన్లు తీసుకుని తనిఖీలు చేపట్టింది. వారి బ్యాగులు, ఇతర సామాన్లను సైతం వదిలిపెట్టకుండా తనిఖీలు నిర్వహించింది.  కళాశాల అధికారులు అమ్మాయి వద్ద యువకుడికి రాసిన ప్రేమ లేఖను కనుగొన్నారు. కాలేజీ అధికారులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఏం జరిగిందో తెలియజేశారు. హిందూ యువతి, ముస్లిం అబ్బాయితో సంబంధం పెట్టుకోవడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కళాశాల ఆవరణలో హిందూ యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న ముస్లిం యువకుడితో మిగిలిన విద్యార్థులు గొడవ పడ్డారు. దీంతో హిందూ యువతి, ముస్లిం వ్యక్తికి సహకరించిన విద్యార్థులతో సహా మొత్తం 18 మంది విద్యార్థులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు మాత్రమే వీరికి హాజరవడానికి అనుమతి ఇచ్చారు.

ఇప్పుడీ ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుదుపులకు కారణమైంది. దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.