Begin typing your search above and press return to search.
కృష్ణాలో ఒక్కరోజే 18 పాజిటివ్ కేసులు ..హై అలర్ట్ !
By: Tupaki Desk | 18 April 2020 7:30 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వైపు ఇంటింటి ఆరోగ్య సర్వే చేయిస్తున్నా కూడా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 31 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 603కి చేరింది. ఇప్పటివరకూ 42 మంది కరోనా భారీ నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 15 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా కి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 546కి చేరింది.
ఇకపోతే , తాజాగా వచ్చిన 31 కరోనా పాజిటివ్ కేసుల్లో .. ఒక్క కృష్ణా జిల్లాలోనే 18 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీనితో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజల అత్యవసర పరిస్థితుల్లో మినహా ఏ ఒక్కరు కూడా ఇంటి గడప దాటి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే , ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు నాకోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను తెప్పించిన విషయం తెలిసిందే. ఇకపై వాటితో 10 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ కిట్ ను ఉపయోగించి సీఎం జగన్ కి కూడా కరోనా పరీక్షలు చేసారు. ఆ పరీక్షల్లో సీఎం జగన్ కు కరోనా నెగెటివ్ అని వచ్చింది.