Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతున్నాయ్
By: Tupaki Desk | 4 Dec 2015 11:14 AM GMTఅనుకున్నదంతా అయ్యింది. ఏదైతే జరగకూడదని కోరుకున్నామో అదే జరుగుతోంది. చెన్నైను ముంచెత్తిన దరిద్రపు వాన కారణంగా ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోవటం ఒకటైతే.. చెన్నైని ముంచేసి వర్షపు నీరు కారణంగా.. అత్యవసర సేవలు అందక ఆసుపత్రుల్లోని రోగులు భారీగా మరణించటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. గడిచిన ఐదు రోజులుగా వర్షాల కారణంగా చెన్నై మహానగరంలో విద్యుత్తు సౌకర్యం దాదాపుగా లేని పరిస్థితి.
దీంతో.. పలు ఆసుపత్రుల్ని జనరేటర్లతో నడిపారు. అయితే.. జనరేటర్లు పని చేయటానికి అవసరమైన డీజిల్ నిండుకోవటం ఒకటైతే.. ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా చెన్నైలోని ఎంఐవోటీ ఆసుపత్రి ఒక్కదాన్లోనే 14 మంది రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా మరణించటం గుండెలు పిండేసే అంశం. గంటలు గడుస్తున్న కొద్దీ ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ నేపథ్యంలో.. చెన్నైలోని వందలాది ఆసుపత్రులకు సంబంధించిన అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో దారుణమైన నష్టం చోటు చేసుకోవటం ఖాయమన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.