Begin typing your search above and press return to search.
50 వేలమంది టార్గెట్ చేసి బాంబ్ వేశారు
By: Tupaki Desk | 26 Dec 2016 9:56 AM GMTకొన్ని సంఘటనలు చరిత్రకు చెందినవి అయినా అవి ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అలాంటిదే. ఈ ఫోటోలో ఉన్నది భారీ బాంబు. గ్యాస్ సిలిండర్ లా ఉన్న ఈ బాంబును రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ఇంగ్లండ్ ఈ బాంబును జర్మనీపై జారవిడిచింది. కానీ అప్పుడు ఇది పేలలేదు. అయితే ఇటీవల ఓ అపార్ట్ మెంట్ కోసం పునాదులు తవ్వగా, - అక్కడ ఈ బాంబు కనిపించింది. ఈ క్రమంలో ఈ భారీ బాంబును నిర్వీర్యం చేసేందుకు జర్మనీ అధికారులు పెద్ద ఎత్తున్నే చెమటోడాల్సి వచ్చింది.
ఈ పురాతన బాంబ్ ను నిర్వీర్యం చేసే సమయంలో పేలకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాంబు బరువు సుమారు 1.8 టన్నులు. ఆగస్ బర్గ్ నగరంలో దీన్ని కనుగొన్నారు. అయితే ఈ నెల 25న దీన్ని నిర్వీర్యం చేశారు. దీని కోసం అధికారులు సుమారు 32 వేల ఇండ్లను ఖాళీ చేయించారు. ఈ చర్య వల్ల 54 వేల మందిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉదయం పది గంటలకే నగరం నుంచి ప్రజలను బయటకు పంపించారు. స్కూళ్లు - జిమ్ ల దగ్గర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత ఫేస్ బుక్ పేజీలో బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేసినట్లు ప్రకటన చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/