Begin typing your search above and press return to search.
పద్దెనిమిది ఏళ్లుగా పార్లేజీ తింటూ బతికేస్తోంది
By: Tupaki Desk | 6 Sep 2016 10:30 PM GMTప్రిన్స్ మహేశ్ నటించిన సినిమాతో ప్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అనే డైలాగ్ పాపులర్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ అలా ఉంటుందో లేదో తెలియదు కానీ... ఓ అమ్మాయి పద్దెనిమిది ఏళ్లుగా బిస్కెట్లు తిని బతికేస్తోంది. అది కూడా పార్లేజీ బిస్కెట్లు మాత్రమే తినిడం తప్ప మరేమీ ముట్టకపోవడం గమనార్హం. కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన రామవ్వ(18) అనే యువతి ‘పార్లే జీ’ బిస్కెట్లను మాత్రమే తింటోంది. ప్రతి రోజు బిస్కెట్లు తప్ప ఏ ఇతర ఆహారాన్ని ఆరగించదు. పసి ప్రాయంలో కూడా తల్లి పాలను తాగలేదు. ఆవు పాలలో ‘పార్లే జీ’ బిస్కెట్లు కలిపిస్తే తినేదట. నాటి నుంచి నేటి వరకు ఏ ఆహారాన్ని తినని రామవ్వ రోజుకు 6 నుంచి 7 ‘పార్లే జీ’ బిస్కెట్ ప్యాకెట్లు తింటూ జీవిస్తోంది.
అయితే ఈ అలవాటును మాన్పించేందుకు వాళ్ల తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. రామవ్వకు వేరే ఆహారం తినిపించాలని లేదా వేరే బ్రాండ్ గల బిస్కెట్లు తినిపించాలని వైద్యులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ‘పార్లే జీ’ బ్రాండ్ ఆగిపోతే ఏ ఆహారం తీసుకోవాలో తెలియడం లేదని రామవ్వ చెబుతుందట. అయితే రామవ్వ తమ్ముళ్లు కూడా ‘పార్లే జీ’ బిస్కెట్లను మాత్రమే తినేవారట. కానీ క్రమక్రమంగా వారు ఆ బిస్కెట్లను తినడం మరిచిపోయారట. ఇదండీ పద్దెనిమిది ఏళ్లుగా పార్లేజీ తింటున్న రామవ్వ కథ.