Begin typing your search above and press return to search.
హాస్టల్ బాత్రూమ్ లో బిడ్డకి జన్మనిచ్చిన విద్యార్థిని ..
By: Tupaki Desk | 3 March 2020 7:00 AM GMTమహారాష్ట్రలో మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ధులే జిల్లా సక్రీలోని సావిత్రీబాయి ఫులే ఆదివాసి హాస్టల్ లో 18 ఏళ్ల విద్యార్థిని , ఎవరికీ తెలియకుండా బిడ్డకి జన్మనిచ్చి , రక్తపుమడుగులో ఉన్న పసిబిడ్డని బాత్రూమ్ బకెట్ లో వదిలివెళ్లింది. ఆ తరువాత కాసేపటికి బాత్రూం లో నుండి వింత శబ్దాలు రావడంతో, భయంతో హాస్టల్ లో ఉన్న అమ్మాయిలు అక్కడికి వెళ్లి చూడగ కళ్ళు కూడా తెరవరని పసికందు రక్తం మడుగులో కనిపించింది. దీనితో ఒక్కసారిగా షాక్ కు గురైన బాలికలు , ఆ విషయాన్ని వార్డెన్ కు చెప్పారు. వార్డెన్ పోలీసులకి సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...ఈ ఘటన జరిగిన ధులే జిల్లా సక్రీలోని సావిత్రీ బాయి ఫులే ఆదివాసి హాస్టల్ లో సుమారు 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వారిలో ఐదో తరగతి నుంచి డిగ్రీ చదివే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ 70 మందిలో ఒకరైన 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థిని తాను గర్భం ధరించిన విషయాన్ని రహస్యంగా దాచింది. చిన్నవయసు కావడం, సరైన ఆహారంలేక బలహీనంగా ఉండటంతో ఆమె గర్భవతి అన్న విషయాన్ని కూడా ఎవరూ పెద్దగా పసిగట్టలేకపోయారు. ఈ క్రమంలోనే గత నెల 29న ఆమెకు పురిటినొప్పులొచ్చాయి. దీనితో తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పకుండా బాత్రూంలోకి పరుగులు తీసిన ఆ అమ్మాయి, అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత పుట్టిన ఆ బిడ్డను ఏం చెయ్యాలో అర్థంకాక, బకెట్ లో వదిలేసి వెళ్లిపోయింది. కొన్ని గంటల తర్వాత మిగతా విద్యార్థులు.. బాత్రూమ్ లో నెత్తుటితో నిండిన బకెట్ లో శిశువును చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే , ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు , ముందుగా ఆ బిడ్డకి తల్లి ఎవరో కనిపెట్టాలని ..హాస్టల్ లో ఉన్న అమ్మాయిలని అందరిని ఒక్కొక్కరిగా విచారించగా , ఒకరిపై అనుమానం వచ్చి , డాక్టర్స్ వద్ద పరీక్షలు నిర్వహించగా ఆమె ఆ బిడ్డకి తల్లి అని తేలింది. మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీబిడ్డను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కడుపు లో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరైనా బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక ఇష్టపడి వెళ్లిందా అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.