Begin typing your search above and press return to search.
తెల్లారితే పెళ్లి... అర్ధరాత్రి అత్యాచారం..
By: Tupaki Desk | 30 May 2017 5:28 AM GMTఅత్యాచారాలు అమ్మాయిల జీవితాలను కాలరాస్తున్నాయి. పైశాచికం తలకెక్కి చేసే పనులు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతికి ఎదురైన అనుభవం వింటే ఎవరికైనా కడుపు తరుక్కు పోతుంది. తెల్లారితే ఆ అమ్మాయి పెళ్లి కావాల్సి ఉండగా ముందు రోజు రాత్రి ఓ దుండగుడు అత్యాచారం చేయడంతో కన్నీరుమున్నీరవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన ఒక పద్దెనిమిదేళ్ల యువతికి నిన్న ఉదయం వివాహ ముహూర్తం నిశ్చయించారు. దీనికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఆదివారం రాత్రి ఆమె గ్రామం బయటకు బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు కొందరు స్నేహితులతో కలిసి ఆమె నోరు మూసి, దగ్గర్లోని చెరుకుతోటలోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలసి వెతికారు. ఆఖరికి సోమవారం సాయంత్రం గ్రామానికి దగ్గర్లోని చెరకు తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పశువుల కాపరులు గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు.
ఇక్కడ ఓ కొత్త విషయం గమనించాలి. మరుగు దొడ్లు.. స్త్రీ మానాలనే కాదు, ప్రాణాలను కూడా రక్షించేవి. వాటి ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం గ్రామీణులు మానుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/