Begin typing your search above and press return to search.
బ్లాక్ అండ్ వైట్ గేమ్ లో ఎల్లో లీడర్స్ దందా
By: Tupaki Desk | 29 Nov 2016 7:28 AM GMTఏటీఎం వద్ద క్యూలైన్ లో నిలబడితే రోజుకు రెండు వేల రూపాయల నోటు మాత్రమే సామాన్యుడికి దక్కుతోంది. కానీ... టీడీపీ నేతలు మాత్రం కట్టలుకట్టలు డబ్బుతో తిరుగుతున్నారు. అనంతపురంలో ఒక టీడీపీ నేత వద్ద ఏకంగా 18.5 లక్షల విలువైన రెండు వేల రూపాయల నోట్లు దొరకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంత మొత్తంతో కొత్త నోట్లు ఆయన ఎలా సంపాదించారు.. అధికార పార్టీ నేతలు బ్యాంకర్లను ఎలా వాడుకుంటున్నారన్న అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారుతున్నాయి.
అనంతపురంలోని ఒక పెట్రోల్ బంకు వద్ద ధర్మవరానికి చెందిన టీడీపీ నేత ఒకరు 18.5 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లతో పోలీసులకు దొరికారు. ఇంత భారీగా రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించగా… బంగారు వ్యాపారి సొమ్ము అంటూ టీడీపీ నేత చెప్పుకొచ్చారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ఐటీ శాఖకు నగదును అప్పగించారు.
కాగా దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో టీడీపీ నేతల దందాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. టీడీపీ నేతలు బ్లాక్ అండ్ వైట్ బిజినెస్ జోరుగా చేస్తున్నారని పోలీసు వర్గాలే అంటున్నాయి. బ్యాంకులతో కుమ్మక్కు అయి కొత్తనోట్లను దొంగదారిలో బయటకు తెచ్చి వాటిని 25 నుంచి 30 శాతం కమిషన్ తో మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనంతపురం టీడీపీ నేత వద్ద పట్టుబడిన రూ. 18.5 లక్షల రెండు వేల రూపాయల నోట్లు కూడా ఆ దారిలో బయటకు వచ్చినవిగానే భావిస్తున్నారు. చంద్రబాబు బ్యాంకర్లపై ఒత్తిడి పెంచడం కూడా తమ పార్టీ నేతల దందాకు సహకరించాలనే కోణంలోనే జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/