Begin typing your search above and press return to search.

ఇటలీలో కొనసాగుతున్నమృత్యుఘోష..ఒకే రోజు 189 మంది ..

By:  Tupaki Desk   |   13 March 2020 10:45 AM GMT
ఇటలీలో కొనసాగుతున్నమృత్యుఘోష..ఒకే రోజు 189 మంది ..
X
ఇటలీలో కరోనా మృత్యుఘోష రోజురోజుకి భారీగా పెరుగుతూనే పోతుంది తప్ప , ఆగడం లేదు. కరోనా వైరస్ ప్రభావం తో ఇటలీలో నిన్న(గురువారం) ఒక్కరోజే 189 మంది చనిపోయారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఇటలీ పౌరులు చనిపోయారు. దీంతో ఇటలీ దేశంలో జనజీవనం స్తంభించి పోయింది. చైనా తరువాత కరోనా అంతగా ప్రభావం చూపుతున్న దేశాల లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది.

ఫుడ్ స్టోర్స్, ఫార్మసీలు.. ఇవి కాక, ఇటలీ లో ఇప్పుడు ఏ దుకాణం కూడా తెరిచిలేదు. రెస్టారెంట్లు, షాపులు, బార్లు. స్కూళ్లు, కాలేజీలు..ఆఫీసులు అన్నీ అన్నీ మూతబడ్డాయి. ఈ కరోనా వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఇటలీలో మానసిక వ్యాధులు ప్రబలే అవకాశం కూడా కన్పిస్తోంది. కరోనా కోరల్లో విలవిలలాడుతోన్న ఇటలీవాసులు ఇక్కడి జైళ్ల ముందు ధర్నాలకు దిగారు.. జైళ్లలోని తమ బంధువులకు వైరస్ సోకుతుందని.. వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

అలాగే, వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వందమందికి మించి ఒకేచోట కలవద్దు అని అధికారులు ప్రజలకు ఆదేశాలు జారీ చేసారు. దేశం మొత్తం క్వారంటైన్‌ లోకి వెళ్లిపోయింది. ..ఫుట్ బాల్ లవర్స్‌ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఇటలీ లో మొత్తం ఆటలన్నీ నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ సుమారుగా 12వేల మందికి ఈ కరోనా వైరస్ సోకింది. దీని తో ఇదే పరిస్థితి అన్ని దేశాలకి రాకుండా ఉండాలి అంటే ..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు , అధికారులు చెప్తున్నారు.