Begin typing your search above and press return to search.
దేశంలో కొత్తగా 1897 పాజిటివ్ కేసులు.. మొత్తం 31332
By: Tupaki Desk | 29 April 2020 7:30 AM GMTప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. కరోనా వైరస్ మృతుల సంఖ్య 2.17 లక్షలుగా నమోదయ్యింది. దాదాపు తొమ్మిదన్నర లక్షల మంది కోలుకోగా.. 19 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 57వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. ఐరోపా - అమెరికాలో నిన్న మొన్నటి వరకూ స్వైరవిహారం చేసిన మహమ్మారి అక్కడ పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అమెరికా - ఇటలీ - స్పెయిన్ లో మరణాలు తగ్గుముఖం పట్టాయి.
అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ అక్కడ 59,266 మంది మృత్యువాతపడ్డారు. న్యూయార్క్, - న్యూజెర్సీ రాష్ట్రాల్లో కొంతమేరకు ఉపశమన ఛాయలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. న్యూయార్క్‌లో సోమవారం 337 మంది మృత్యువాతపడ్డారు. గత నెల రోజుల్లో ఆ రాష్ట్రంలో ఒక్కరోజులో చోటుచేసుకున్న అత్యల్ప మరణాలు ఇవే.
ఇటలీలోనూ కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. స్పెయిన్‌లోనూ బాధితుల సంఖ్య 2.32 లక్షలుగా నమోదయ్యింది. ఇటలీలో 27,359 మంది, స్పెయిన్‌లో 23,822 మంది - ఫ్రాన్స్ లో 23,660 మంది - బ్రిటన్ లో 21,678 మంది ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో తాజాగా 22 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ లక్షణాలేవీ కనిపించనప్పటికీ పాజిటివ్ గా తేలుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బెల్జియంలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 7,331 మంది వైరస్ కు బలయ్యారు. మరణాలు చోటుచేసుకున్నాయి. రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ 93వేలకుపైగా కేసులు నిర్ధారణ కాగా.. మరణాల సంఖ్య 867గా ఉంది.
*భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య..
భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ విజృంభణ అంతకంతరూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1897 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 31332కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 7696 మంది కోలుకోగా.. మరో 22629 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం 24.56గా ఉంది.
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 31 మరణాలతోపాటు 728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9318 చేరగా.. 400మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ముంబైలో వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. గుజరాత్ లో 3744కి చేరింది. 181మంది మరణించారు. మధ్యప్రదేశ్ లో 2387 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 120 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 3314 మందికి కరోనా సోకగా 54మంది మరణించారు.
*ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7727 శాంపిళ్లను పరీక్షించగా 73 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ కాగా 31 మంది మరణించారని యాక్టివ్ కేసులు 1014గా ఉన్నాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4 చిత్తూరులో 3 తూర్పుగోదావరిలో 1 గుంటూరులో 29 కడపలో 4 కృష్ణాలో 13 కర్నూలులో 11 ప్రకాశంలో 4 శ్రీకాకుళంలో 1 విశాఖపట్నంలో 1 పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
*తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణలో మంగళవారం మరో ఆరుగరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఈ కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1009కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 1009కు చేరింది. వైరస్ బారిన పడినవారిలో 42మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 374మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. తెలంగాణలో 50శాతం కరోనా కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో 19063 మంది నమూనాల్ని సేకరించి పరీక్షలు చేస్తే 5.3 శాతం పాజిటివ్ వచ్చాయన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్. ఐదు కేసుల కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకు కంటెయిన్ మెంట్ చేయకూడదని ఐసీఎంఆర్ చెప్పిందన్నారు.దాన్ని పాటిస్తామని మంత్రి ఈటల తెలిపారు.