Begin typing your search above and press return to search.
కొత్త సీఎం కావాలంటున్న అసమ్మతి ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 23 Aug 2017 10:58 AM GMTతమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే ఎక్కువగా మలుపు తిరుగుతున్నాయి. సీఎం పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకున్న 19 మంది ఎమ్మెల్యేలు కొత్త రాగం అందుకున్నారు. తమిళనాడుకు కేఏ సెంగోట్టియన్‌ను సీఎం చేయాలని ఆ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. సెంగోట్టియన్ ను సీఎం చేసి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని గవర్నర్ కు సూచించారు.
ఇప్పటికే పళనికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ అందజేశారు. పన్నీరు వర్గానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ.. సీఎంను మార్చేందుకు తాము అంగీకరిస్తే.. అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతిస్తామని టీటీవీ దినకరన్ వర్గం నేతలు తనతో మాట్లాడారని చెప్పారు. కానీ ఆ పని జరగదని తేల్చిచెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు అందజేసిన లేఖలో పన్నీరుసెల్వంకు కూడా మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఉందని సమాచారం. ఇక శశికళ సోదరుడు వీకే దివకరన్ మాత్రం స్పీకర్ పీ ధన్ పాల్ ను సీఎం చేయాలని సూచించారు.
మరోవైపు ఏఐఏడీఎంకె చీలికవర్గం నేత దినకరన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు బస చేసిన విండ్ ఫ్లవర్ రిసార్ట్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పన్నీర్ సెల్వం - పళనిస్వామి వర్గాలు విలీనమైన తరువాత కొంతమంది ఎమ్మెల్యేలు జైలు శిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్దతు తెలిపిన విషయం విదితమే. తమిళనాడులో అయితే వారికి రక్షణ ఉండదని భావించి పొరుగున ఉన్న పుదుచ్చేరికి వారిని తరలించారు. ఈ నేపథ్యంలో సదరు రిసార్ట్ వద్దకు చేరుకున్న అమ్మ పార్టీ అభిమానులు అక్కడ ఆందోళన చేపట్టారు.