Begin typing your search above and press return to search.
పుష్కర తొక్కిసలాట: 20కి చేరువలో మృతులు
By: Tupaki Desk | 14 July 2015 6:50 AM GMTగోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు మహా విషాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీని అంచనా వేయటంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం పెను విషాదానికి దారి తీసే పరిస్థితి.
వెల్లువలా వచ్చిన భక్తుల్ని.. ఘాట్లలోకి అనుమతించ విషయంలో చోటు చేసుకున్న గందరగోళం.. పెను విషాదానికి కారణమైంది. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ల వద్ద జరిగిన భారీ తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంటలు గడిచే కొద్దీ మరింతగా పెరుగుతోంది.
తొలుత మృతుల సంఖ్య ముగ్గురిగా భావించినా.. అంతకంతకూ పెరుగుతూ.. ఈ సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 17 దాటిందని చెబుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. అనధికారికంగా మృతుల సంఖ్య 20కు దగ్గర్లో ఉన్నట్లు చెబుతున్నారు.
తొక్కిసలాట జరిగిన దగ్గరల్లో.. మొబైల్ మెడికల్ వ్యాన్లు కానీ.. వైద్య సాయం అందించే సిబ్బంది కానీ.. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు కానీ లేకపోవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ పెను విషాదం మొత్తం అధికారుల నిర్వహణ వైఫల్యంగానే చెబుతున్నారు.