Begin typing your search above and press return to search.

ఉరిశిక్ష విధించ‌డానికి త‌లారి కావ‌లెను..!!

By:  Tupaki Desk   |   12 July 2017 4:47 PM GMT
ఉరిశిక్ష విధించ‌డానికి త‌లారి కావ‌లెను..!!
X
ఉరి శిక్ష విధించ‌డంపై అభ్యుద‌య‌వాదులు - వాస్త‌విక వాదుల మ‌ధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు ప‌క్క‌న పెడితే...ఓ వ్య‌క్తికి ఉరి శిక్ష విధించాక అది అమ‌లు చేయ‌డానికి మెజిస్ట్రేట్ త‌ర్వాత `త‌లారి`దే ముఖ్య‌మైన‌ పాత్ర‌. ఆ వ్య‌క్తికి ఉరి తాడు బిగించి, న‌ల్ల గుడ్డ మొహానికి వేసి, ఉరి వేసి చ‌నిపోయేదాకా అక్క‌డే ఉండి ఉరి అమ‌ల‌య్యేలా చూసే బాధ్య‌త త‌లారిది. అంత‌టి ప్రాధాన్య‌త ఉంటుంది త‌లారికి. అయితే... దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద‌దైన తీహార్ జైలులో మాత్రం త‌లారీ కొర‌త వేధిస్తోంది. దాదాపు 19 మంది ఉరి శిక్ష కు రెడీగా ఉన్నా ఆ ఉరి శిక్ష ను అమ‌లు చేసే అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి త‌లారి మాత్రం తీహార్ జైలులో లేడు.

2013 ఫిబ్ర‌వ‌రి 9 న తీహార్ జైలులో అఫ్జ‌ల్ గురు కు ఉరి శిక్ష విధించింది కూడా ఎవ‌ర‌నే విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ లేదు. బ‌య‌టి నుంచి వ‌చ్చిన వ్య‌క్తి ఉరి విధించాడా లేక జైలు స్టాఫే ఉరి విధించారా అనే విష‌యాలు మాత్రం బ‌హిర్గ‌తం కాలేదు. 1950 లో తీహార్ జైలును నిర్మించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు జైలు రికార్డుల్లో ఒక్క త‌లారి వివ‌రాలు కూడా న‌మోదు కాలేదు. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఖైదీలు న‌లుగురికి ఉరి శిక్ష విధించింది కోర్టు. ప్ర‌స్తుతానికి ఉరి శిక్ష విధించిన వారిలో తీహార్ జైలు లో ఉన్న 19 మందిలో న‌లుగురు ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులే. అయితే.. వీళ్ల‌ను ఉరి తీయ‌డానికి కావ‌ల‌సిన త‌లారి మాత్రం తీహార్ జైలులో లేడు. 1989 లో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ ని చంపిన కేసులో ఉరి శిక్ష ప‌డిన ఇద్ద‌రు ఖైదీలు స‌త్వంత్ సింగ్ - కెహ‌ర్ సింగ్ ల‌ను ఉరి తీయ‌డానికి మీర‌ట్ జైలు నుంచి రూ. 200 ఇచ్చి మ‌రీ త‌లారిని తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఇక 1989 నుంచి 2013 వ‌ర‌కు జైలులో ఒక్క ఉరి శిక్ష ను కూడా విధించలేదు. దీంతో త‌లారి అవ‌సరం రాలేదు.. ఒక వేళ త‌లారి ఉన్న ఏం ప‌నిలేకున్నా అత‌డికి సాల‌రీ ఇవ్వాల్సి వ‌చ్చేదంటూ స‌మాధానాన్ని జైలు అధికారులు దాట‌వేస్తున్నారు . అయితే.. త‌లారిగా ప‌ని చేయ‌డానికి అక్క‌డి స్థానికులు చాలా మంది కూడా రెడీ గానే ఉన్నారట‌. కాని.. త‌లారి అవ‌స‌రం అంత‌గా లేదు అన్న‌ట్లుగా జైలు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట!