Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో దారుణం:19ఏళ్ల యువతి పై తాత, మేనమామ అత్యాచారం

By:  Tupaki Desk   |   5 Feb 2020 7:30 AM GMT
హైదరాబాద్ లో దారుణం:19ఏళ్ల యువతి పై తాత, మేనమామ అత్యాచారం
X
సభ్య సమాజం తలదించుకునే దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. చిన్నారి ఆలనా పాలన చూడాల్సిన తాత తన పైశాచికత్వాన్ని మనవరాలిపై చూపించాడు. బాధ్యతగా మసలుకోవాల్సిన మేనమామ సైతం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనను కాపాడాల్సిన వారే చిదిమివేయడంతో ఆ యువతి ఇప్పుడు బోరుమంటోంది.

హైదరాబాద్ లోని బండ్లగూడలో దారుణం జరిగింది. తాత, మేనమామ కలిసి 19ఏళ్ల యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండడంతో భరించలేని ఆ యువతి చివరకు దారుణాల పై తల్లికి తెలిపింది. ఆమె పోలీసులను ఆశ్రయించడం తో ఈ దమన కాండ వెలుగు లోకి వచ్చింది.

బండ్లగూడ మహ్మద్ నగర్ కు చెందిన షేక్ అప్సర్ కు 70 ఏళ్లు.. ఈయన ఇంట్లోనే 19 ఏళ్ల మనమరాలు చిన్నప్పటి నుంచి పెరుగుతోంది. సదురు బాలికపై కన్నేసిన ఆ తాత షేక్ అప్సర్ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. షేక్ అప్సర్ కుమారుడు షేక్ సిద్ధిఖ్ సైతం ఆరు నెలల క్రితం ఇదే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బెదిరించారు. ఇలా తాత, మేనమామ అత్యాచారాలు చేస్తుండడంతో భరించ లేని యువతి తల్లికి చెప్పింది.

దీంతో తల్లి చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇలా కాటికి కాలు చాపిన తాత, ఆయన కొడుకు మేనమామ ఆకృత్యానికి ఆ యువతి ఇన్నాళ్లుగా నరకం అనుభవించింది.