Begin typing your search above and press return to search.
దేశంలో తొలిరోజు 1.91 లక్షల మందికి టీకా
By: Tupaki Desk | 17 Jan 2021 2:44 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారతదేశం నిన్న ప్రారంభించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో ఒకే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ మహాక్రతువును ప్రారంభించారు. తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలిరోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. శనివారం టీకా తీసుకున్న వారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 3351 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో 16755 మంది సిబ్బంది పాల్గొన్నారని కేంద్రం తలిపింది. కోవిన్ యాప్ లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ఆలస్యమైందని తెలిపింది.
తొలిరోజు 12 రాష్ట్రాల్లో కోవాగ్జిన్, మరో 11 రాష్ట్రాల్లో కోవిషీల్డ్ టీకా వేసినట్లు తెలిపింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్యసిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా పనిచేశాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తలిపారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, టీకా పరిశ్రమల వారిని అభినందించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ టీకా పంపిణీ జోరుగా సాగింది. ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 16963మందికి టీకాలు వేశారు. ఇక తెలంగాణలో 3653 మందికి టీకాలు వేశారు. అత్యధికంగా దేశంలో బీహార్ లో 16401మందికి టీకాలు వేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 15727మందికి వేశారు.