Begin typing your search above and press return to search.
1927 నాటి నోటు.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 18 May 2022 4:19 AM GMTపాతకాలం నాటి నోటు ఒకటి దొరికింది. సర్లేనని దాన్ని అలానే దాచి ఉంచారు. తాజాగా అలా ఇంట్లో ఉంచే కన్నా దాన్ని వేలానికి పెడితే బాగుంటుందన్న ఆలోచనతో దాన్ని ఆన్ లైన్ అమ్మకానికి పెట్టారు. అనూహ్యంగా ఆ నోటుకు పలికిన ధరతో అవాక్కు అయ్యారంతా. పాలస్తీనాకు చెందిన ఈ పాతకాలం నోటు మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అసలు దీని కత ఎలా మొదలైందంటే..
పాలస్తీనాలోని ఎసెక్స్ లో ఆక్స్ ఫామ్ వాలంటీర్ గా పాల్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతను బ్రెంట్ వుడ్ బ్రాంచ్లో పని చేస్తున్నప్పుడు 100పౌండ్ల పాత కాలపు కరెన్సీ నోటు దొరికింది.
1927లో బ్రిటిష్ మాండేట్ ఉన్న వేళ.. ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసిన ఆ నోటును అలానే ఉంచేశారు. అయితే.. ఆ నోటును ఇంట్లో ఉంచటం కంటే ఆన్ లైన్ వేలానికి పెడితే బాగుంటుందని భావించాడు.
దీంతో.. లండన్ లోని స్పింక్ వేలం హౌస్ లో వేలానికి పెట్టారు. అయితే.. ఎవరూ అంచనా కట్టని రీతిలో ఆ నోటుకు భారీ డిమాండ్ లభించింది. అనూహ్యంగా ఈ నోటుకు ఏకంగా రూ.1.3 కోట్ల ధర పలికింది. దీంతో.. ఆ నోటు సొంతదారు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.29 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేస్తే.. అందుకు నాలుగైదు రెట్లకు దగ్గర దగ్గర పలకటం విశేషంగా మారింది.
ఈ వేలంలో ఇంత భారీ ధర లభించిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించారు. ఈ భారీ మొత్తం ఆక్స్ ఫామ్ ఎన్జీవో చేసే కార్యక్రమాలకు వెళుతుందని చెబుతున్నారు. ఈ సంస్థ ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్ధులకు.. తూర్పు ఆఫ్రికాలో కరువు పీడిత ప్రజలకు సాయం చేస్తుంటుంది. ఈ భారీ మొత్తాన్ని వారునిర్వహించే కార్యక్రమాల్లో వెచ్చించనున్నారు.