Begin typing your search above and press return to search.

రాహుల్ వ‌స్తుంటే...ఆ సీనియ‌ర్‌ ను గెంటేశారు

By:  Tupaki Desk   |   9 April 2018 9:58 AM GMT
రాహుల్ వ‌స్తుంటే...ఆ సీనియ‌ర్‌ ను గెంటేశారు
X
కాంగ్రెస్ ర‌థసార‌థి రాహుల్ గాంధీ స‌మావేశంలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఆయ‌న దీక్ష‌కు వ‌స్తుంటే...ఆ పార్టీకి చెందిన నేత‌లు ముఖ్య‌నేత ఒక‌రిని ఆ వేదిక వెళ్ల‌గొట్టారు. ఈ ప‌రిణామం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. వివ‌రాల్లోకి వెళితే...దళితులపై జరుగుతున్న దాడులకు నిరసగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరాహార దీక్ష చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ లో ఉన్న మహాత్మాగాంధీ సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ ఈ దీక్ష చేపడుతోంది. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ రాజ్‌ ఘాట్‌ కు వచ్చి గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. దళితులపై దాడిని ఖండిస్తూ రాహుల్ ఒక రోజు దీక్షలో కూర్చోనున్నారు.అయితే ఈ స‌మ‌యంలోనే మాజీ కేంద్ర మంత్రి జగదీశ్ టైట్లర్‌ ను ఆ వేదిక నుంచి వెళ్లగొట్టారు.

మతసామరస్యాన్ని పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ ఈ దీక్ష చేపట్టింది. ఇందుకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ‌స్తున్నాడ‌ని పార్టీ పేర్కొంది. అయితే రాహుల్ వేదికకు రాకముందే అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. ఆ దీక్ష‌కు టైట్ల‌ర్ విచ్చేశారు. అయితే ఇదే స‌మ‌యంలో పార్టీ నేత‌లు ఆయ‌న్ను అక్క‌డి నుంచి పంపించివేశారు. దీంతో అక్క‌డున్న ప‌లువురు సీనియ‌ర్లు నొచ్చుకున్నారు. కాగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో టైట్లర్ ప్రధాన నిందితుడు. తనతో పాటు రాజీవ్ గాంధీ ఆ అల్లర్ల సమయంలో ఢిల్లీలో టూర్ చేశారని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో టైట్లర్ తెలిపారు. సిక్కు అల్లర్లకు కారణం టైట్లర్ అని ఓ దశాబ్ధం క్రితం నానావతి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ లోనూ తేలింది. దీంతో ఆయ‌న్ను పార్టీ దూరం పెట్టింది.