Begin typing your search above and press return to search.

ఉత్తరకొరియాలో దారుణం: కరోనా సోకిందని చంపేశారు

By:  Tupaki Desk   |   1 March 2020 8:12 AM GMT
ఉత్తరకొరియాలో దారుణం: కరోనా సోకిందని చంపేశారు
X
కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో వందలాది మందిని బలితీసుకుంది. మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. చైనా పక్కన ఉండే దక్షిణకొరియాలో ఇప్పటికే 11 మంది చనిపోగా 60మందికి పైగా రోగులకు ఈ వ్యాధి సోకింది. దీంతో చైనా పక్కనే ఉండే మరో దేశం ఉత్తరకొరియా అలెర్ట్ అయ్యింది.

చైనాతో ఉన్న అన్ని సరిహద్దులను మూసేసింది. చైనాతో రవాణా, వాణిజ్యం సహా అన్నింటిని తెంచుకుంది.

కాగా కరోనా వైరస్ రాకుండా ఆ దేశ నియంత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాజాగా ఈ వైరస్ సోకిందని ఓ వ్యక్తిని ఉత్తరకొరియాలో చంపేశారట.. దేశ అధిపతి కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేరకే ఉత్తరకొరియాలో వెలుగుచూసిన తొలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడిని చంపారని తెలిసింది.

ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా అధికారులు వెంటనే అతడిని చంపేసినట్టు తెలిసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆదేశాల మేరకే కరోనా బాధితుడిని చంపామని అధికారులు తెలిపారు.