Begin typing your search above and press return to search.

ఓటమి దెబ్బ..టీమిండియాలో మార్పులు!

By:  Tupaki Desk   |   2 July 2019 10:26 AM GMT
ఓటమి  దెబ్బ..టీమిండియాలో మార్పులు!
X
ఒక్క ఓటమి.. దానిపై వచ్చిన విమర్శలతో టీమిండియాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి నిదానంగా ఆడాడు అనే విమర్శలను ఎదుర్కొన్న కేదార్ జాదవ్ ను ఫైనల్ లెవెన్ నుంచి తప్పించారు. వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మార్పులతో బరిలోకి దిగింది.

కేదార్ జాదవ్ ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో దినేష్ కార్తిక్ ను జట్టులోకి తీసుకున్నారు. దినేష్ కార్తిక్ కు ప్రపంచకప్ లో ఇదే తొలి మ్యాచ్. అలాగే ఈ ప్రపంచకప్ లో అంత మెరుగైన ప్రభావం చూపని కుల్దీప్ యాదవ్ కు కూడా ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు.

కుల్దీప్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చాడు. గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరం అయిన భువనేశ్వర్ కు మళ్లీ చోటు దక్కింది. హార్ధిక్ పాండ్యా మీద కూడా వేటు తప్పదనే అభిప్రాయాలూ వినిపించాయి. అయితే ఫాస్ట్ బౌలర్ కేటగిరిలో అతడికి చోటు దక్కింది.

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ తీరుపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. అయితే సీనియర్ కోటాలో ధోనీ చోటు నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ విరాట్ కొహ్లీ - కోచ్ రవిశాస్త్రిలు కూడా ధోనీ మద్దతుదారులే కావడంతో.. చెత్తగా ఆడుతున్నా ధోనీ జట్టులో కొనసాగగలుగుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.