Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేని ‘సోషల్ మీడియా’లో చంపారు?
By: Tupaki Desk | 14 Oct 2015 4:38 AM GMTకాస్త ఆసక్తికరంగా ఉందనిపిస్తే చాలు.. వెనుకా ముందు చూడకుండా సదరు సమాచారాన్ని షేర్ చేసేయటం నేటి ట్రెండ్. అయితే.. ఇలాంటి వైఖరి లేనిపోని చిక్కుల్లో పడేయటమే కాదు.. అనవసరమైన ఇబ్బందుల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉంది. హడావుడి చేద్దామని.. గందరగోళానికి గురి చేద్దామని ఆకతాయిలు చేసే ఎదవ ఐడియాలు చివరకు అరెస్ట్ ల వరకూ వెళ్లటం ఖాయమని తాజా ఉదంతం నిరూపిస్తుంది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక ఎమ్మెల్యే చనిపోయారంటూ వదంతులు సృష్టించి.. సోషల్ మీడియాలో ఆ విషయాన్ని ప్రచారం చేసి.. మీడియాలోనూ.. మిగిలిన వర్గాల్లోనూ హడావుడి చేయాలన్న ఆకతాయి ఆలోచన ఇద్దరు యువకుల్ని జైల్లో పడేలా చేసిన వైనమిది. యాకుత్ పురా ఎమ్మెల్యే మృతి చెందినట్లుగా వాట్సప్.. ఫేస్ బుక్ లలో ఒక పోస్ట్ తెగ హడావుడి చేసింది.
దీన్ని చూసిన చాలామంది షేర్ చేయటంతో సదరు నేతను అభిమానించే వారు.. పార్టీ కార్యకర్తలు.. మీడియా ప్రతినిధులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అయితే.. ఇదంతా తప్పుదారి పట్టించేందుకు.. సంచలనం కోసం ఇద్దరు యువకుల పన్నాగం కావటం గమనార్హం. బాలానగర్ కు చెందిన షేక్ ఇమ్రాన్.. యాకుత్ పురాకు చెందిన మహ్మద్ రాషెద్ అనే ఇద్దరు యవకుల పనిగా తేల్చారు.
‘‘యాకుత్ పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మృతి చెందారు. రేపు మధ్యాహ్నం మక్కా మసీదులో జనాబ్ నమాజ్ ఉంది. దీనికి అందరూ హాజరు కావాలి’’ అని రాషెద్ వాట్సప్ లో పోస్ట్ చేశారు. ఈ మెసేజ్ ను అందరికి షేర్ చేయాలంటూ అతను తన ఫ్రెండ్ ఇమ్రాన్ వాట్సప్ గ్రూప్ కి పంపాడు. దీన్ని ఇమ్రాన్ పట్టించుకోకుండా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అంతే.. నిమిషాల వ్యవధిలో ఈ సమాచారం వైరల్ అయ్యింది.
ఎమ్మెల్యే మృతి మీద వదంతులు త్వరగా వ్యాప్తి చెందారంటూ అలజడిని సృష్టించాయి. పలువురు హడావుడిగా వాకబు చేయటం మొదలు పెడితే.. మీడియా వాళ్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇక.. సదరు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. అయితే.. తమకొచ్చిన సమాచారం కేవలం పుకారు మాత్రమేనని తేలటంలో ఊపిరి పీల్చుకున్నారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చివరకు సాంకేతికతతో తనిఖీలు నిర్వహించి.. దీనికి కారణమైన ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక.. ఈ సమాచారం సృష్టించిన యువకుడితో పాటు.. వాట్సప్ గ్రూప్ లోపోస్ట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ ను సైతం అరెస్ట్ చేశారు. సో.. చేతికి వచ్చిన సమాచారాన్ని వెనువెంటనే షేర్ చేసే ముందు.. వాట్సప్ అడ్మినిస్ట్రేటర్లు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏదైనా తేడా వస్తే.. మొదట అదుపులోకి తీసుకునేది గ్రూప్ ఆడ్మినిస్ట్రేటర్ ని అన్న విషయం మర్చిపోకూడదు.