Begin typing your search above and press return to search.
డీఎస్ నివాసంలో ఈటల 2 గంటల భేటీ.. ట్విస్టు ఏమంటే?
By: Tupaki Desk | 12 May 2021 12:30 PM GMTఅందరికి అర్థమయ్యేలా చేస్తే అదెలా రాజకీయం అవుతుంది. అందునా దాదాపు పాతికేళ్లుగా కేసీఆర్ తో సావాసం చేసి.. ఆయన వద్ద శిష్యరికం చేసిన తర్వాత.. ఆయన రాజకీయ ఎత్తులు అన్నో ఇన్నో ఒంటికి పట్టకుండా ఉంటాయా? భూకబ్జా ఆరోపణల మరక వేసి.. ఆ పై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పటికి.. ఇప్పటికే గులాబీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల.. గడిచిన కొద్దిరోజులుగా వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగానే కాదు.. గులాబీ పార్టీలో కొత్త గబులు పుట్టేలా చేస్తున్నాయని చెప్పాలి.
నిన్నటికి నిన్న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి నలభై నిమిషాల పాటు భేటీ అయిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ రోజున ఆయన.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు.. గడిచిన కొంతకాలంగా గులాబీ బాస్ కేసీఆర్ తో పడక.. దూరంగా ఉంటున్న ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డి.శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. భట్టితో మాదిరి కాకుండా.. దాదాపు రెండు గంటల పాటు ఆయనతో చర్చలు జరిపిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరో ఊహించని ట్విస్టు ఏమంటే.. అధికారికంగా డీఎస్ టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఆయన కుమారుడు ఎంపీ అరవింద్ బీజేపీ తరపున పని చేస్తుండటం తెలిసిందే. ఈటల భేటీలో తండ్రి డీఎస్.. ఆయన కుమారుడు కమ్ బీజేపీ ఎంపీ అరవింద్ తోనూ చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. డీఎస్ తో భేటీని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అందుకు భిన్నంగా అరవింద్ సైతం వీరి సమావేశంలో కూర్చున్నట్లు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో బీజేపీకి చెందిన పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడే కాకున్నా.. వ్యూహాత్మకంగా ఒక్కొక్క అడుగు వేస్తూ.. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. శిష్యుడి అడుగుల్ని గురువు ఏ మాత్రం పసిగడతారో చూడాలి. నిత్యం జరిపే భేటీలతో ఈటెల ప్లానింగ్ పక్కాగా ఉన్నట్లు చెబుతున్నారు.