Begin typing your search above and press return to search.
కొంపముంచిన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ...ఇద్దరు మృతి..?
By: Tupaki Desk | 29 Nov 2019 6:36 AM GMTహైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలు ..నగర వాసులని భయపెడుతున్నాయి. వారం రోజుల్లోనే హైదరాబాద్ లో సుమారుగా 7 యాక్సిడెంట్స్ జరిగాయి. ఇక కొత్తగా ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ , బంజారాహిల్స్ లో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్స్.. ఇలా వరుస ప్రమాదాలు నగర వాసుల్లో భయాలని పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం లో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు.
గురువారం రాత్రి అర్థరాత్రి దాటిన తర్వాత ఆరాంఘర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 221 దగ్గర కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా ..7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్స్ అని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు చూస్తే .. చక్కగా చదువుకొని , మంచి ఉద్యోగాలు చేస్తారని - లక్షలకి లక్షలు పోసి మంచి కాలేజీ లో చేర్చితే ..ఇలా విలాసాలకు అలవాటు పడి - కాలేజ్ లో ఎవరికీ తెలియకుండా గోడలు దూకి బయటకి వచ్చి ..ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాధారణంగా నారాయణ - శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుకునే వారు రాత్రి సమయాల్లో గోడలు దూకి బయటకి రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.
ఇక ఈ దారుణమైన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. హైదరాబాద్ లోని మాదాపూర్ నారాయణ కాలేజీ లో ఈ 9 మంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వీరంతా కూడా బర్త్ డే పార్టీ కోసం అని - కాలేజీ సిబ్బందికి తెలియకుండా గోడ దూకి బయటకి వెళ్లినట్టు సమాచారం. ఆలా బయటకి వెళ్లిన వారు రాజేంద్రనగర్ లో జరిగిన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరు కాలేజ్ నుండి బయటకి వెళ్లిన నేపథ్యంలో గురువారం రాత్రి మహబూబ్ నగర్ కు చెందిన 9 మంది విద్యార్థులు మాయం అయ్యారని కాలేజీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారం గురించి ఆరా తీస్తున్న సమయంలోనే రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు తరుణ్(19) - ఉదయ్(19) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి వెళ్లి వివరాలు సేకరించగా ..వీరంతా మాదాపూర్ నారాయణ కాలేజీ స్టూడెంట్స్ అని తేలింది. కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల పిల్లర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.