Begin typing your search above and press return to search.
కరోనా: చీకటి ఖండం..చీకట్లో కలిసిపోతుందట!
By: Tupaki Desk | 9 May 2020 10:30 PM GMTకరోనా వైరస్ ..ఇప్పటివరకు ఈ భూ ప్రపంచం పై ఎన్నడూ చూడనటువంటి అతి భయంకరమైన మహమ్మారి. చైనాలో వెలుగుచూసిన ఈ కరోనా మహమ్మారి ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకింది. ముఖ్యంగా అమెరికాలో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇకపోతే, చల్లదనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఆరు ఖండాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇందులో ఆఫ్రికాలో ప్రభావం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.
అయితే, ఇప్పుడు ఆ ఖండంలోనూ వేగంగా విస్తరిస్తున్నట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఆ ఖండంలో వైరస్ వేగంగా విస్తరిస్తే దానికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం అని అంటున్నారు. కరోనా కనీసం 2 నుంచి 4.4 కోట్ల మందికి వ్యాపించే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. దాదాపుగా 1.9 లక్షల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలోని 45 దేశాలపై దీని ప్రభావం ఉండబోతున్నది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధిస్తున్నారు. అసలే ఆకలితో అలమటించే ఆఫ్రికా ఖండానికి లాక్ డౌన్ శాపంగా మారబోతున్నది.
లాక్ డౌన్ కారణంగా ఆ ఖండం ఆకలితో అలమటించే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా వైరస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయకుంటే చీకటి ఖండం మరింత చీకట్లో కలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. కాగా , ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా కరోనా భారిన పడగా ... 276,253 మంది మరణించారు.