Begin typing your search above and press return to search.

250 కుక్కల్ని చంపేసిన ఆ 2 కోతుల్ని పట్టేశారు

By:  Tupaki Desk   |   20 Dec 2021 12:29 PM IST
250 కుక్కల్ని చంపేసిన ఆ 2 కోతుల్ని పట్టేశారు
X
కోతి పిల్లను చంపేశాయన్న కోపంతో.. కుక్క జాతి మీద కోపం పెంచుకున్న కోతుల గురించి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ప్రతీకార ఎపిసోడ్ పుణ్యమా అని ఏకంగా 250 కుక్కల ప్రాణాలు పోయాయి. దీనిపై వచ్చిన వార్తలు వైరల్ గా మారాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో అధికారులు ఈ కోతుల సంగతి లెక్క తేల్చేందుకు నడుం బిగించారు. కోతులు వర్సెస్ కుక్కల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్ కు చెక్ చెప్పేలా పనిని అధికారులు పూర్తి చేశారు.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్ గావ్ కు చెందిన కుక్కలు.. ఒక కొండముచ్చు పిల్లను చంపేయటం తెలిసిందే. అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న రెండు కొండ ముచ్చలు అల్లకల్లోలం చేయటం తెలిసిందే. కుక్క పిల్ల కనిపిస్తే చాలు.. చటుక్కున వచ్చి.. వాటిని తమ కాళ్లతో పట్టుకెళ్లి.. ఎత్తైన భవనం మీద నుంచి జారవిచటం.. అవి కాస్తా చచ్చిపోతున్న వైనం తెలిసిందే.

ఇలా ఇప్పటివరకు 250 కుక్కల్ని చంపేసిన ఆ రెండు కోతులు.. తమ పగను కుక్కలకు పరిమితం చేయకుండా స్కూళ్లకు వెళ్లే పిల్లల మీద ప్రతాపం చూపించటం మొదలైంది. దీంతో పలువురు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుక్కల్ని చంపేసిన ఉదంతంలో కీలకంగా వ్యవహరించిన రెండు కొండ ముచ్చుల్ని బంధించారు.

మిగిలిన కొండ ముచ్చుల్ని సైతం పట్టుకొని దూరంగా ఉన్న అడవుల్లో విడిచి పెట్టి వస్తున్నారు. 250 కుక్కల్ని చంపేసిన రెండు కొండముచ్చుల్ని అధికారులు బంధించారన్న వార్తతో స్థానికులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.