Begin typing your search above and press return to search.

బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు!!

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 PM GMT
బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు!!
X
భారత్‌ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం 151కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 126 మంది భారతీయులు - 25 మంది విదేశీయులు ఉన్నారు. ఈ వైరస్ బారినపడిన వారిలో ముగ్గురు మృతి చెందగా - పద్నాలుగు మంది కోలుకున్నారు. తాజాగా, కర్ణాటకలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో ఈ కన్నడనాట ఈ మహమ్మారి బాధితుల సంఖ్య పదమూడుకు చేరుకుంది.

కరోనాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు తెలిపారు. తాజాగా కరోనా సోకిన వారిలో స్పెయిన్ నుండి వచ్చిన 25 ఏళ్ల యువతి - అమెరికా నుండి బెంగళూరుకు వచ్చిన 56 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యక్తి మార్చి 6వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. యువతి మాత్రం ఇటీవలే స్పెయిన్‌ లో పర్యటించి వచ్చింది.

వీరిద్దరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి - చికిత్స అందిస్తున్నట్లు మంత్రి శ్రీరాములు తెలిపారు. ఇంతకుముందు కర్ణాటకలో ఈ కేసుల సంఖ్య 11గా ఉండగా - ఇప్పుడు మరో రెండు కేసులు నమోదు కావడంతో 13కు పెరిగింది. ఈ సంఖ్య కూడా కలుపుకుంటే ఇండియాలో కరోనా కేసులు 153గా ఉంటుంది.

తెలంగాణ - మహారాష్ట్ర - గోవాలలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. పద్నాలుగు రాష్ట్రాలు - రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్ సోకింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42 - కేరళలో 27 - యూపీ - హర్యానాలలో 16 చొప్పున సోకాయి. కరోనా పట్ల కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. విద్యా సంస్థలు - జిమ్‌ లు - పార్కులు - థియేటర్లు.. ఇలా దాదాపు అన్ని క్లోజ్ అయ్యాయి.