Begin typing your search above and press return to search.

ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం

By:  Tupaki Desk   |   15 March 2020 5:21 AM GMT
ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం
X
ప్రజలను కాపాడాల్సిన పోలీసులే చెరపట్టి చెరిపేస్తే ఆ మహిళలకు రక్షణ ఎక్కడుంటుంది. ఇప్పుడు పర్యాటక ప్రాంతమైన తమిళనాడు సమీపన గల పుదుచ్చేరిలో అలాంటి దారుణమే చోటుచేసుకుంది.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. మందు - విందులు - ఈవెంట్ల ఖర్చు తక్కువ. ప్రతి వారంతపు రోజుల్లో ప్రేమ జంటలు ఇక్కడికి రావడం పరిపాటిగా సాగుతోంది.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు పుదుచ్చేరి పరిసరాల్లో బసచేశారు. గస్తీ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సతీష్ కుమార్ - సురేష్ లు ఈ రెండు ప్రేమ జంటలు ఉన్న గదుల తలుపుతట్టారు. అందులో ఒకరి గది తలుపు తెరవగా.. మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని.. కేసులు పెడతామని బెదిరించారు. భయపడి ఓ ప్రేమ జంట రూ.20వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది.

ఆ తర్వాత మరో ప్రేమ జంట వద్దకు వెళ్లగా వారి వద్ద డబ్బు లేదు. దీంతో ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. ఈ జరిగిన దారుణం బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అత్యాచారం - మామూళ్ల సంఘటనలు బయటకు రావడంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.