Begin typing your search above and press return to search.

ఏపీలో ఓటుకు 2 వేలు.. తెలంగాణ‌లో ఓటుకు 40 వేలా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 11:30 AM GMT
ఏపీలో ఓటుకు 2 వేలు.. తెలంగాణ‌లో ఓటుకు 40 వేలా?
X
ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు. వారే ప్ర‌భుత్వాల‌ను ఏర్ప‌రుచుకుంటారు. ఓటు అనే ఆయుధం తో ప్ర‌భుత్వాధినేత‌ల‌ను నిర్ణ‌యించుకుంటారు. అయితే.. అత్యంత విలువైన‌.. అంత‌కు మించి అత్యంత ర‌హ‌స్య‌మైన ఈ ఓటు హ‌క్కును కొనుగోలు చేయ‌డం అనేది.. ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు మ‌ర్రి చెట్టు ఊడ‌ల మాదిరిగా.. ఈ ఓటు కొనుగోలు ప్ర‌క్రియ ముదిరిపోయి.. విస్త‌రించింది. ఒక‌ప్పుడు.. దేశంలో ఓటు కొంటున్నారు.. అంటే.. అది ఏపీలోనే అనే మాట వినిపించేది.

లెక్క‌కు మిక్కిలిగా పేద‌లు ఉండ‌డం.. వారికి ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌డంతో నాయ‌కులు వారికి డ‌బ్బులు ఎర‌వేసి ఓటును కొనుగోలు చేసిన‌ట్టుగా కొంద‌రు చెబుతారు. అప్ప‌ట్లో ఓటు కు రూ.200ల‌తో మొద‌లైన ఈ కొనుగోలు ప్ర‌క్రియ ఇప్పుడు.. పెరిగిపోయింది. ఓటుకు ఏపీలో రూ..2000 వ‌ర‌కు కూడా పెరిగింది. గ‌త 2019లో చాలా మంది నేత‌లు.. పార్టీల‌కు అతీతంగా.. ప్ర‌జ‌ల‌కు రూ.500 ల నుంచి రూ.2000 వ‌ర‌కు పంచార‌ని.. ఒక లెక్క అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీంతో ఏపీలో ఓట్లు కొనుగోలు చేయ‌నినాయ‌కుడు లేరంటూ.. పెద్ద ఎత్తున జాతీయ‌స్థాయిలో చ‌ర్చ కూడా జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇది తెలంగాణ‌కు కూడా పాకింది. వాస్త‌వానికి ఎన్నికల సంఘం నియ‌మాల ప్ర‌కారం.. ఓటును కొన‌డం అనేది .. నేరం.. అమ్ముకోవ‌డ‌మూ నేర‌మే. అయితే.. అంద‌రూ. ముసుగు దొంగ‌ల మాదిరిగా.. ఎవ‌రి ప‌ని వారు కానిచ్చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. తెలంగాణ‌లో ఇప్పుడు ఓటు విలువ అమాంతం 40 వేల‌కు చేరిపోయింద‌ట‌!

ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజం. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓటుకు రూ.5000 చొప్పున పంచారు. దీంతోప‌క్క మండ‌లాల‌వారు కూడా.. త‌మ‌కు కూడా రూ.5000 ఇవ్వాల‌ని రోడ్ల‌మీద‌కి వ‌చ్చి నాయ‌కుల‌ను డిమాండ్ చేశారు. మ‌రి ఆ త‌ర్వాత‌.. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఈ సంస్కృతి మునుగోడుకు కూడా పాకింది. ఇక్క‌డ ఇప్పుడు ఓటు అంటే.. చాలు.. 40000 ఇస్తావా? అని ఓట‌ర్లు అడుగుతున్నార‌ట‌.

మునుగోడు ఉప ఎన్నిక పోటీని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే.. బీజేపీ.. టీఆర్ ఎస్‌లు ఇక్క‌డ గెలిచి తీరాల్సిందేన‌నే భావ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు ఈ రెండు పార్టీల‌కు అత్యంత కీల‌కంగా మారింది. దీంతో ఓటుకు ఎంత ఇచ్చేందుకైనా.. నాయ‌కులు వెనుకాడ‌డం లేదు. దీంతో అమాంతం.. ఇది రూ.40 వేల‌కు చేరింద‌ని అంటున్నారు. మ‌రి ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు కూడా పార్టీలు వెనుకాడ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనిని ఇలా ప్రోత్స‌హిస్తూ.. పోతే.. భ‌విష్య‌త్తులో ప్ర‌జాస్వామ్యం ఏమైపోతుందో అనే ఆవేద‌న మేధావులు.. ప్ర‌జాస్వామ్య వాదుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.