Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఆ ‘షో’ భద్రత కోసం 2వేల మంది పోలీసులు
By: Tupaki Desk | 20 Aug 2022 3:11 PM GMTహైదరాబాద్ మహానగరంలో ఈ రోజు నిర్వహిస్తున్న ‘షో’ హైటెన్షన్ గా మారింది. శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం నిర్వహిస్తున్న స్టాండప్ మునావర్ ఫారుఖీ కామెడీ షోను అడ్డుకోవటానికి హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన ఉంది. మరోవైపు.. ఈ షో జరిగితే జరిగే పరిణామాలకు డీజీపీ మహేందర్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ లదే బాధ్యత వహించాలన్న హెచ్చరిక చేయటం తెలిసిందే. రాముడు కోసం తాను చావటానికైనా సిద్ధమని ప్రకటించటం ద్వారా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత టెన్షన్ పుట్టిస్తున్నారు.
ఓవైపు హిందూ సంఘాల అభ్యంతరాలు.. మరోవైపు రాజాసింగ్ హెచ్చరికల నడుమ పారుఖీ కామెడీ షో కోసం రంగం సిద్ధమవుతోంది. శనివారం ఉదయం వరకు ఈ షో నిర్వహణ కోసం శిల్పకళావేదికకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని చెప్పటం విశేషం. మరోవైపు.. కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫాం మీద దీనికి సంబంధించిన టికెట్లను అమ్మారు. ఇదిలా ఉంటే ఈ షో విషయంలో ఉన్న భద్రతా సమస్యల నేపథ్యంలో దాదాపు 2 వేల మంది పోలీసుల్ని మొహరించినట్లుగా చెబుతున్నారు.
ఎంతమందితో భద్రతను నిర్వహిస్తున్న వైనంపై ఎవరూ అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. శిల్పకళావేదిక చుట్టూ మాత్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్న రాజాసింగ్ వ్యాఖ్యలకు పోలీసుల వాదన మరోలా ఉంది.
తన షోలో భాగంగా మునావర్ పారుఖీ హిందూ దేవుళ్లపై అనుచిత కామెడీ చేస్తున్నాడని.. అతడి షోకు అనుమతులు ఇవ్వొద్దని హిందూ సంఘాల ప్రతినిధులు డీజీపీకి.. సీపీకి కంప్లైంట్లు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో మునావర్ షో ఆపాలని.. అందుకు అందరూ తరలిరావాలని సోషల్ మీడియాలో హిందూ సంఘాల వారు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పలు సంఘాల వారు రవీంద్ర భారతి ప్రాంగణలో సమావేశమైన తీర్మానం చేశారు. ఈ షోకు హాజరయ్యే వారికి మూడు అంచెల్లో భద్రతా తనిఖీలు చేస్తున్నారు.
ఈ షోకు హాజరయ్యే వారి మొబైల్ ఫోన్లను లోపలకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని.. వాటర్ బాటిళ్లు తీసుకురావటానికి కూడా అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. షోకు వచ్చే వారి చేతుల్లో ఎలాంటి వస్తువులు ఉండొద్దని. ఒకవేళ తీసుకొస్తే లోపలకు అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. సీతమ్మ..రాముడిని అవమానించిన ఫారూఖీ ప్రోగ్రాం తెలంగాణలో ఎందుకు పెట్టారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మునావర్ కు ఆరోగ్యం సరిగా లేదని.. అతను హాజరు అవుతాడా? లేడా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ షోకు అన్ని అనుమతులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఏమైనా.. హైటెన్షన్ గా మారిన ఈ షో విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో పాటు.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్వహించేలా చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఉద్రిక్తతల నడుమ జరిగే ఈ షో ఎలాంటి పరిస్థితులు దారి తీస్తాయన్న టెన్షన్ నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.