Begin typing your search above and press return to search.

దీపావళి వేళ..ఆ మహానగరంలో ఆ రెండింటినే కాల్చాలట!

By:  Tupaki Desk   |   27 Oct 2019 4:46 AM GMT
దీపావళి వేళ..ఆ మహానగరంలో ఆ రెండింటినే కాల్చాలట!
X
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ప్రధానమైంది దీపావళి. శ్రావణమాసంతో మొదలయ్యే పండుగ సీజన్.. దీపావళితో పరిసమాప్తమవుతుంది. వరుస పెట్టి వచ్చే పండుగల కోసం చాలామంది ఆగస్టు నెల ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూసేటోళ్ల సంఖ్య తక్కువేం కాదు.

అయితే.. దీపావళి పండుగ వేళ కాలుష్యం పేరుతో టపాసులు కాల్చొద్దంటూ చేసే ప్రచారం అంతా ఇంతా కాదు. ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున కాలుష్య వ్యర్థాల్ని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నా చేష్టలుడిగినట్లు ఉండే ప్రభుత్వం.. కాలుష్య కారాకాల్ని నియంత్రించే విషయంలో తరచూ ఫెయిల్ అయ్యే సర్కారు.. హిందూ పండుగల విషయంలో తరచూ కాలుష్యం పేరును తెర మీదకు తేవటాన్ని తప్పు పడుతున్నారు.

సంక్రాంతి పండుగ వేళ భోగి వేళ వేసే భోగి మంటలతో వాయు కాలుష్యమని.. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలకు జీవహింస అని.. హోలీ ఆడుకునే రంగులతో పర్యావరణానికి ఏ మాత్రం హింత కాదని.. వినాయకచవితికి విగ్రహాల్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడుతూ.. కాలుష్యాన్ని పెంచుతున్నారని.. దీపావళికి టపాసులతో పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారంటూ వరుస పెట్టి అభ్యంతరాలు చెప్పే వారెవరూ.. క్రిసమస్ సందర్భంగా పెద్ద ఎత్తున చెట్లను నరికేసి.. క్రిస్ మస్ ట్రీ అంటూ హడావుడి చేయటంలో ఎక్కడా కాలుష్యం కనిపించదెందుకని ప్రశ్నిస్తుంటారు. అంతేనా.. క్రిస్ మస్ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే స్టార్స్ కారణంగా పేపర్.. ప్లాస్టిక్ వినియోగించాల్సి రావటంలో తప్పు ఎందుకు కనిపించదు?

అంతేనా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాలుష్యానికి కారణం జంతు కళేబరాలు.. వాటి వ్యర్థాలు. అలాంటప్పుడు బక్రీద్ పండుగ వేళ.. భారీ ఎత్తున సాగే గొర్రెల వధతో కూడా కాలుష్యమే కదా? మరి.. వాటన్నింటికి లేని కాలుష్యం.. ఒక్క హిందు పండుగులకు మాత్రమే ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తుంటారు. దీనికి తగ్గట్లే తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అక్కడి సర్కారు తీసుకున్న నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు.

ఢిల్లీలో చోటు చేసుకున్న భారీ కాలుష్యం నేపథ్యంలో.. దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల్లో కేవలం రెండు రకాల్ని మాత్రమే అనుమతించాలని డిసైడ్ చేశారు. దీని ప్రకారం కాకరపూవ్వొత్తులు.. చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళిని ఉత్సాహంగా జరుపుకోవాలని ఆశ పడిన లక్షలాది మందికి ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం నిరాశకు గురి చేస్తే.. దీపావళి టపాసుల వ్యాపారం చేసే వారికి ప్రభుత్వ నిర్ణయం భారీగా దెబ్బ తీసినట్లు చెబుతున్నారు.