Begin typing your search above and press return to search.
ప్రభుత్వానికి 10 లక్షలిచ్చి.. 20 కోట్లు కొట్టేసిన.. నేతలు.. వర్ధన్ పేరిట మోసం!
By: Tupaki Desk | 25 Oct 2021 8:30 AM GMTపావలా ఇచ్చి.. రూపాయి పావలా కొట్టేయడం అంటే ఇదేనేమో! కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకు లు చేసిన ఈ ఘరానా మోసం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేపుతోంది. వర్ధన్ పేరుతో డిపాజిట్లు స్వీకరిం చి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు 20 కోట్ల రూపాయలు కొట్టేశారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటం టే.. ఓ పది లక్షల రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా సమర్పించుకున్నారు. తీవ్ర సంచలనం రేపుతోన్న ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డే అన్నీ తానై వ్యవహరించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రధాన కార్యాలయం ఉన్న వర్ధన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్.. గతేడాది నవంబరు 7న కర్నూలు జిల్లా ఆత్మకూరులో బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాంచ్‌కు మహేశ్ కుమార్ అలియాస్ జాషువా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన నాయకుడు బాలన్న సహకారంతో ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ సొసైటీని ప్రారంభించారు. సొసైటీ స్థాపనకు ఎమ్మెల్యే పూర్తి సహకారం అందించారు. బాలన్న కూతురు సంస్థ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం సివిల్ సప్లయ్స్ రాష్ట్ర కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆ బ్రాంచ్ ప్రారంభోత్సవ సమయంలో అది ఎమ్మెల్యేదే అనే స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో జిల్లా వాసులు నమ్మారు. కర్నూలు జిల్లాలోని డోన్, వెలుగోడు, పత్తికొండ, నంద్యాల, ఆత్మకూరు, పెసరవాయి తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో డిపాజిట్లు వసూలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు కేంద్రంగా కొన్ని నెలలుగా ఈ తతంతంగా సాగింది. గ్యారెంటీగా డిపాజిటర్లకు చెక్కులను ఇచ్చారు. రెండు, మూడు నెలల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు.
డిపాజిట్ చేసిన వారు సొసైటీ ఇచ్చిన చెక్‌లు బ్యాంకులో వేయగా.. సదరు సంస్థ అకౌంట్‌లో డబ్బు లేవని అధికారులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశారు. చావు తప్ప గత్యంతరం లేదనుకున్న కొందరు ఇటీవల ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డిని కలిసి వరుస ఫిర్యాదులు చేయడంతో మోసాలు బయటపడుతున్నాయి. డిపాజిటర్లలో స్థానిక పోలీసు అధికారి, మహానందికి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం 76 మంది డిపాజిటర్లు ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ 76 మందికి చెందిన డిపాజిట్ల విలువ రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల దాకా ఉంటుందని తెలిసింది.
ఇది శిల్పా బ్యాంక్. వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్. శిల్పా బ్యాంక్ అంటే వర్ధన్ బ్యాంక్. అక్క చెల్లెమ్మలు ఎప్పటి నుంచో ఒక బ్యాంక్ పెట్టాలని అడుగుతున్నారు. ఇదే ఆ బ్యాంక్. అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పడం గమనార్హం. అంతేకాదు.. చెల్లించిన సొమ్ము సంవత్సరంలో రెట్టింపు చేస్తామని, బైకులు, కార్ల కొనుగోలుపై ఏకంగా 50 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామంటూ చెప్పారు. దీంతో ఎక్కువమందిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాగా, గతంలోనూ వర్ధన్ బ్యాంక్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వర్ధన్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించిన మహేశ్ కుమార్ గతంలో కూడా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు, రైతుల నుంచి రూ.60 లక్షలకు పైగా వసూలు చేశాడు.