Begin typing your search above and press return to search.
అమెరికాలో కాల్పుల మోత..20మంది మృతి
By: Tupaki Desk | 4 Aug 2019 4:50 AM GMTవీకెండ్ లో సరదాగా షాపింగ్ కు వచ్చిన వారు కొందరు.. కుటుంబంతో నిత్యావసరాలు కొనేందుకు వచ్చిన వారు మరికొందరు.. ఇలా సుమారు 3000 మంది వాల్ మార్ట్ స్టోర్ కు వచ్చారు. అప్పుడే వచ్చాడో ఆగంతకుడు. 21 ఏళ్ల యువకుడు తుపాకీతో వాల్ మార్ట్ లోకి ప్రవేశించి రక్తపాతం సృష్టించాడు.
*కాల్పులు జరిగింది ఎక్కడ.?
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.. ఆ దేశంలో గన్ కల్చర్ కు 20మంది అసువులు బాసారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో నగరంలో ఈ దారుణం వెలుగుచూసింది. టెక్సాస్ లోని ఎల్ పాసోలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో ఓ యువకుడు కాల్పులకు దిగారు. విచక్షణ రహితంగా యువకుడు జరిపిన కాల్పుల్లో 20మంది మృతి చెందగా.. 30మంది వరకు గాయపడ్డారని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి.
*కాల్పులు జరిపింది ఎవరు.?
అమెరికాలోని టెక్సాస్ ఎల్ పాసో సమీపంలోని సియాలో విస్టాలో గల వాల్ మార్ట్ సూపర్ మాల్ లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన హంతకుడిని ప్యాట్రిక్ క్రూసియస్ అనే యువకుడిగా గుర్తించారు. ఇతడు డల్లాస్ శివార్లలోని అల్లెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. 21 ఏళ్ల ప్యాట్రిక్ తుపాకీని చేత్తో పట్టుకొని యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ఈ మారణహోమం సృష్టించాడు. అరుపులు, కేకలతో వాల్ మార్ట్ దద్దరిల్లింది.
* కాల్పులకు కారణమేంటి.?
కాల్పులు జరిపిన ప్యాట్రిక్ అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఇతర దేశస్థులపై వివక్షే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మెక్సికో దేశంతో సరిహద్దుల్లో ఈ ఎల్పాసో నగరం ఉంటుంది. మెక్సికో సహా అమెరికా కింద నున్న లాటిన్ అమెరికా దేశాల నుంచి వలసవచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున వేరే దేశస్థులు నివాసం ఉంటున్నారు. ఇతర దేశస్థుల ఆదిపత్యాన్ని ఇక్కడి అమెరికన్లు నిరసిస్తున్నారు. దీన్నో సున్నిత - సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి పోలీసులు భద్రతను ఎప్పుడూ కట్టిదిట్టం చేస్తుంటారు. తాజాగా మరణించిన వారిలో ఎక్కువ మంది మెక్సికన్లే ఉండడంతో ఇది జాత్యాహంకర దాడిగానే భావిస్తున్నారు. మెక్సికన్లను అసహ్యించుకునే స్థానిక అమెరికన్ యువకుడు ప్యాట్రిక్ ఈ కాల్పులకు తెగబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
* వాల్ మార్ట్ లో 3వేల మంది ప్రజలు
కాల్పులు జరిగిన వాల్ మార్ట్ లో 3వేల మంది ఉన్నారు. కాల్పుల సమాచారం అందుకున్న అమెరికన్ పోలీసులు వాల్ మార్ట్ కు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు దిగిన పాట్రిక్ వాల్ మార్ట్ ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. మెక్సికన్లపై ఉన్న అసహ్యాన్ని పెంచుకున్న ప్యాట్రిక్ ఇలా హంతకుడిగా మారి వారిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రజలు పరిగెడుతున్న వీడియోలు కొందరు ట్విట్టర్ లో పెట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాగా వాల్ మార్ట్ లో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. కాల్పుల్లో మృతిచెందిన వారికి అండగా ఉంటామని ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.