Begin typing your search above and press return to search.

గాల్వన్ ఘర్షణ : 20 మంది భారత సైనికులు మృతి !

By:  Tupaki Desk   |   17 Jun 2020 3:30 AM GMT
గాల్వన్ ఘర్షణ :  20 మంది భారత సైనికులు మృతి !
X
భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లడక్ లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులు సరిహద్దును దాటి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల సైనికులు ఉప సంహరణ ప్రక్రియ జరుగుతున్న సమయం లో జరిగిన ఘర్షణ తో కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘర్షణల్లో మరింత భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.

ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొదట కల్నల్ సంతోష్‌ తో పాటు మరో ఇద్దరు జవాన్లు మాత్రమే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న మంచుకొండల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఉండడంతో పరిస్థితి విషమించిన మరో 17 మంది మరణించారని భారత సైన్యం ప్రకటించింది మరోవైపు మరణించిన, తీవ్ర గాయాల పాలైన చైనా సైనికుల సంఖ్య 43 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఐతే చైనా వైపు ఎంతమంది చనిపోయారో తెలియలేదు.

కాగా, ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌జై శంకర్, రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యాక విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. 15వ తేదీ రాత్రి చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటేందుకు యత్నించాయని వెల్లడించింది. ఆ సమయంలో భారత బలగాలు అడ్డుకున్నాయని.. దీంతో జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలుస్తోంది.