Begin typing your search above and press return to search.

టీకా వేసుకుంటే 20 కేజీల బియ్యం ఫ్రీ .. ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:30 AM GMT
టీకా వేసుకుంటే 20 కేజీల బియ్యం ఫ్రీ .. ఎక్కడంటే ?
X
దేశ ప్రజలకు ఓ శుభవార్త , కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు స్పీడ్‌ గా తగ్గి పోతున్నాయి. దేశంలో ఐదో రోజు కరోనా కేసులు లక్షలకు దిగువన నమోదు అయ్యాయి. అలాగే దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా పెద్దగా లేదు. ఇక మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా ముందుకు సాగుతుంది. కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అయితే , కొన్ని చోట్ల మాత్రం ఇంకా వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకురావడం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా సోకుతుందని , అలాగే వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతున్నారని ప్రచారం జరగడంతో దాన్ని చూసి భయంతో వ్యాక్సిన్ వద్దు అని అంటున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ఎన్ని రకాలుగా ప్రజలకు వివరించిన కానీ లాభం లేకుండా పోతుంది.

ఈ నేపథ్యంలోనే పలు దేశాలు , పలు ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చే వారికి పలురకాల ఆకర్షితమైన బహుమతులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచనకి తెరతీసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ కు చెందిన గ్రామస్తులలో టీకా పట్ల ఉన్న అపోహాలను తొలగించాలని నిర్ణయం తీసుకోని , దానికోసం వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచితంగా 20 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లుగా ఓ ప్రకటన చేసింది. ఇలా ప్రకటన చేసిన తక్కువ రోజుల్లోనే 80 మందికి పైగా టీకాలు వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. సుబన్‌ సిరి జిల్లాలోని యాజాలికి చెందిన సర్కిల్ ఆఫీసర్ తాషి వాంగ్‌ చుక్ థాంగ్‌ డోక్ ఈ ఆలోచన చేశాడు. 45 సంవత్సరాలు నిండినవారికి టీకా వేసే ఉచిత బియ్యం కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమం బుధవారం వరకు ఉంటుంది. జిల్లాలో గ్రామాలలో ఉన్న టీకా పై అపోహాలను తొలగించడానికి కృషి చేస్తున్నామని తాషి వాంగ్ చుక్ థాంగోడోక్ అన్నారు. జూన్ 20 నాటికి సర్కిల్ లో 100 శాతం టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి శుక్రవారం, శనివారం వారి ఇళ్ల వద్దకే వెళ్ళనున్నట్లుగా తెలిపారు. ఆఫర్ సమయం గడిచిన తర్వాత 20 కిలోలకు బదులుగా 10 కిలోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,95,445 మందికి టీకా వేసినట్లు రాష్ట్ర రోగ నిరోధక శాఖ అధికారి డిమోంగ్ పాడుంగ్ తెలిపారు.