Begin typing your search above and press return to search.
కరోనావేళ.. కర్నూలులో కోతుల మృత్యుహేల..
By: Tupaki Desk | 20 April 2020 2:24 PM GMTకరోనా వేళ కోతుల మృత్యువాత కలకలం రేపుతున్నాయి. వానరాల మరణం కరోనా అత్యధికంగా ఉన్న కర్నూలు జిల్లాలోనే చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. కోతుల మరణానికి కారణమేంటన్న ఆందోళన అందరి మదిని కలవరపెట్టింది
ఏపీలో కర్నూలులో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఇప్పటివరకు 158 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గంటగంటకు కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
అయితే కరోనా వేళ కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో సుమారు 20కి పైగా కోతులు మరణించడం కలకలం రేపింది. మరికొన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అపస్మారకస్థితికి చేరుకున్నారు. నాలుగురోజులుగా పెద్ద సంఖ్యలో కోతుల మరణం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతోంది. కరోనా వైరస్ తో ఇవి చస్తున్నాయా అనే ఆందోళన జిల్లా అంతటా వ్యాపించింది.
అయితే వైద్యులు, పశువైద్యాధికారులు అక్కడికి చేరుకొని కోతులకు పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో షాకింగ్ విషయం బయటపడింది. లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితం కావడం.. ఆహారం ఎవరూ ఇవ్వకపోవడం.. వేసవిలో అడవిలో పండ్లు ఫలాలు, నీరు లేకపోవడంతో ఆకలితో అలమటించి కోతులు చనిపోయాయని పశువైద్యాధికారులు తేల్చారు.
జంతు ప్రేమికులు కోతులకు ఆహారం అందించాలని వైద్యులు కోరుతున్నారు. కరోనాతో చావలేదని తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్థులు కోతులకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల జీవాలకు ఆహారం కూడా దొరకక మరణించడం కలిచివేస్తోంది.