Begin typing your search above and press return to search.
20 మంది డ్రగ్స్ వినియోగం..: పోలీసుల వద్ద ఆధారాలు..?
By: Tupaki Desk | 8 April 2022 8:31 AM GMTహైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన రాడిసన్ పబ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 148 మందిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. అయితే డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాల్లేకుండానే వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించడంపై పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. కానీ కొందరిపై అనుమానం ఉన్నాయని, వారికి డ్రగ్స్ పరీక్షలు చేసిన తరువాత నిర్దారిస్తామని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా 20 మంది డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు రకరకాల కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వారి విచారణలో కొందరు డ్రగ్స్ వినియోగించారని, దీంతో వారికి నోటీసులపు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే పబ్ నిర్వాహకులైన అభిషేక్, అనిల్ ను జ్యూడిషియల్ కస్టడికి తరలించారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్టుల్లో గోవాకు చెందిన వారి నెంబర్లు ఉన్నట్లు సమాచారం. ఇక మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లిస్టులో గతంలో కొంతమంది డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ పబ్ లోకి అనిల్ గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడని, వాటిని కొందరిని అందించాడని అనుకుంటున్నారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని పక్కా సమాచారం ఉన్నందునే పోలీసులు దాడి చేశారని అంటున్నారు. కాగా ఇందులో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉండడం గమనార్హం.
ఈ కేసులో ఏ1 గా అనిల్, ఏ2గా అభిషేక్, ఏ3 గా అర్జున్, ఏ4 గా కిరణ్ రాజులను చేర్చారు. ప్రస్తుతం అనిల్, అభిషేక్ లు రిమాండ్ లో ఉన్నారు. అర్జున్, కిరణ్ పరారీలో ఉన్నారు. ఈ పబ్ కి కిరణ్ రాజ్ లీగలైజర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
పబ్ పై పోలీసుల దాడి తరువాత ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ను రద్దు చేసింది. అంతకుముందు 24 గంటల పాటు లిక్కర్ సప్లయ్ కి అనుమతి తీసుకోవడంతో పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఏకంగా బోర్డు పెట్టారు. అంతేకాకుండా ఇందులో ఎంట్రీ కావడానికి ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా పోలీసులు ఎంట్రీ ఇచ్చి దాడి చేశారు.
రాష్ట్రాన్ని డ్రగ్స రహితంగా మార్చాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వినియోగం, విక్రయంపై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ముక్యంగా నగరంలో పబ్ లపై పూర్తి నిఘా పెట్టామని నార్కొటిక్ ఎన్ పోర్స్ మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగించే స్పాట్స్ పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్ లు, రెస్టారెంట్, రిసార్ట్స్ ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు.