Begin typing your search above and press return to search.
కొత్త నోట్ల కోసం వాడుతున్న పేపర్ ఎక్కడిదంటే
By: Tupaki Desk | 12 Dec 2016 9:37 AM GMTపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురైన నోట్ల కొరతను అధిగమించేందుకు ఇటు రిజర్వ్ బ్యాంక్, అటు కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో నోట్ల రద్దును యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధమైనప్పటికీ సరిపడా కాగితం లేకపోవడంతో... త్వరలో నోట్ల ముద్రణ కాగితం కోసం టెండర్లు పిలవాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖా కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 20,000 టన్నుల కాగితాన్ని దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చేవారంలో ఈ టెండర్లు ఆహ్వానించనున్నట్లు వివరించారు.
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నోట్ల కొరత, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించిన శక్తికాంత్ దాస్...పెద్ద ఎత్తున నోట్లు ముద్రిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని తేల్చేశారు. ఈ క్రమంలో సరిపడా నోట్ల రద్దు కాగితం లేదని గుర్తించామని దానికి కాగితాన్ని దిగుమతి చేసుకోవడం ఒకటే పరిష్కారమని తేల్చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది 12వేల టన్నుల కాగితం దిగుమతి చేసుకున్న దానికి అధనంగా మరో 8వేల టన్నులు జోడించి మొత్తం 20,000 టన్నులు పేపర్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత్ దాస్ వివరించారు. కాగా ఇది భారీ స్థాయిలో నోట్ల తయారీ పేపర్ దిగుమతి ఏమీ కాదని గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత డిమాండ్‌కు తగినట్టుగా నగదును ముద్రించలేకపోతున్న విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం.. లోటును భర్తీ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్‌పీ)లో 24 గంటలపాటు నోట్ల ముద్రణ కొనసాగుతోంది. ఇందుకోసం అందులో పనిచేసి ఉద్యోగవిరమణ పొందిన ఉద్యోగుల సహాయం తీసుకుంటున్నట్టు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్) తెలిపింది. యూనిట్‌లో నిరంతరాయం నోట్ల ముద్రణ కొనసాగుతున్నదని చెప్పింది. ఇండోర్ ఎయిర్‌పోర్ట్ నుంచి రోజూ రెండు మూడు లోడ్‌లను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
గతంలో ఈ యూనిట్‌లో 20, 50, 100, 500 నోట్లను ముద్రించే వారని, నోట్లరద్దు తర్వాత కేవలం కొత్త రూ.500 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నట్టు చెప్పారు. ఈ యూనిట్ నుంచి కొత్తనోట్ల మొదటి లోడ్‌ను డిసెంబర్ 1న భోపాల్‌కు పంపినట్టు తెలిపారు. ఉద్యోగులు భోజన విరామ సమయంలోనూ ముద్రణ ఆపకుండా బాధ్యతలు పంచుకుంటున్నారని చెప్పారు. సెలవులు రద్దు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గి 1500 మాత్రమే ఉన్నారని, ఇప్పుడు ఉత్పత్తి పెరగాల్సి ఉండటంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నామని చెప్పారు.