Begin typing your search above and press return to search.
రాజీవ్ మరణానికి కారణం ‘‘రూ.200’’?
By: Tupaki Desk | 24 Oct 2016 4:57 AM GMTగాంధీ ఫ్యామిలీలో ఇందిర.. రాజీవ్ మరణాలు తీవ్ర విషాదాన్ని మిగల్చటమే కాదు.. యావత్ దేశంలో విషాదాన్ని నింపేశాయి. దేశ రాజకీయాలకు కర్త.. కర్మ.. క్రియ లాంటి ఒక రాజకీయ కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న ఈ దారుణ హత్యలు దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయనే చెప్పాలి. వీరి మరణాలపై ఇప్పటికే విస్తృత కథనాలు.. ఆధారాలు బయటకు రావటం తెలిసిందే.
అయితే.. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్య ఒకటి చేశారు. రాజీవ్ మరణంపై ఆయన చేసిన వ్యాఖ్య కొత్తగా ఉండటమే కాదు.. అందరూ లైట్ గా తీసుకునే అవినీతి ఎంత ప్రమాదకరమైనదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ కక్కుర్తి పడి.. రూ.200 లంచానికి ఆశ పడటమే రాజీవ్ మరణానికి కారణమైందని.. ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం దాడి జరిపేందుకు అవకాశం ఇచ్చిందంటూ చంద్రకుమార్ సంచలన వ్యాఖ్య చేశారు.
నిన్న జరిగిన జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు హాజరైన చంద్రకుమార్ తనదైన స్టైల్లో అవినీతిపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తేనే ఫలితాలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రస్తావించటం ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమేర అవినీతి జరుగుతుందన్న విషయం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పారు. రోడ్ల మరమ్మతుకు రూ.300 కోట్లు కేటాయిస్తే.. 25 శాతం పనులకు 75 శాతం బిల్లులు చెల్లించటం చూస్తే అవినీతి ఎంత విస్తృతంగా ఉందన్న విషయం తేలిపోయిందన్నారు. అవినీతి కక్కుర్తితో ఎంత దారుణాలకు తెర తీస్తాయన్న మాటతో పాటు.. అవినీతి విస్తృతి ఎంత ఎక్కువగా ఉందన్నది తన రెండు ఉదాహరణలో ఆయన స్పష్టం చేశారని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/