Begin typing your search above and press return to search.

200 రోజుల అమరావతి ఉద్యమం అటకెక్కిందా?

By:  Tupaki Desk   |   6 July 2020 8:30 AM GMT
200 రోజుల అమరావతి ఉద్యమం అటకెక్కిందా?
X
ఉమ్మడి ఏపీ విడిపోయింది. బంగారు బాతు లాంటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఆయాచిత వరం కాగా.. రాజధాని కూడా లేని ఏపీ కట్టుబట్టలతో బయలు దేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కగానే మరోసారి ఏపీ విడిపోయినా.. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని అధికార వికేంద్రీకరణకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఏపీ సీఎం జగన్ మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు చేయాలని సంకల్పించారు. ఏపీ ప్రజలకు సమాన అభివృద్ధిని పంచాలని డిసైడ్ అయ్యారు.

అయితే అంతకుముందే చంద్రబాబు ‘అమరావతి’ పేరిట ఒక కొత్త లోకం సృష్టించాలని బాగానే సర్దుబాట్లు చేసుకున్నారు. మరో సింగపూర్ లా చేస్తానని టీడీపీ నేతలతో భారీగానే పెట్టుబడులు పెట్టించారనే పేరుంది. ఇప్పుడు జగన్ మూడు రాజధానులు అనడంతో తమ ఆర్థిక మూలాలు కుప్పకూలుతాయని గ్రహించి అమరావతి ఉద్యమాన్ని లేవనెత్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

చంద్రబాబు తొందరపాటుతో అమరావతిలో ఉన్న నాలుగు ఊర్ల ప్రజలతో కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టేశారు. కానీ జగన్ సర్కార్ మారలేదు. కరగలేదు. కనికరించలేదు.. దీంతో వాళ్లకు నీరసం వచ్చి ఊరుకున్నారు. అమరావతి ఉద్యమం తగ్గుతున్న తరుణంలో హైదరాబాద్ లో ఉన్న కూకట్ పల్లి ఆంధ్రా వలసవాదులను తాజాగా బస్సులు వేసి మరీ అమరావతికి తరలిస్తున్నారట.. దీనివెనుక ఏదో కుతంత్రం ఉందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఏపీ సీఎం జగన్ అమరావతి రైతులకు వరాలిచ్చేశారు. కౌలును 10 నుంచి 15 సంవత్సరాలకి పెంచుతూ నిర్ణయించేశారు. దీంతో చాలా మంది అమరావతి రైతులు వెనక్కితగ్గారు. అయితే మొన్న చంద్రబాబు 200 రోజుల అమరావతి ఉద్యమం పేరిట ఏదో హడావుడి చేస్తే అది కాస్తా కరోనా దెబ్బకు కొట్టుకొని పోయింది. కరోనాకు మేము భయపడుతుంటే నీ గోల ఏందీ అని చంద్రబాబు మొహం మీదే తెగించి చెప్పారంట.. ఇక పెయిడ్ ఉద్యమాలు చేయమంటూ కుండబద్దలు కొట్టారంట.. దీంతో పాలుపోని చంద్రబాబు నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఏంటో అని అక్కడి ప్రజలు జుట్టుపీక్కుంటున్నారట..